Thursday, 14 April 2016

రామ రసం ప్రాముఖ్యత

రామ రసం ప్రాముఖ్యత
దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | 
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు. భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.
శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోను బెల్లం పానకం ... పెసర వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. సీతారాములకు జరిపే కళ్యాణ వైభవంలో మార్పులు వచ్చినా, తీర్థ ప్రసాదాలుగా ఆనాటి నుంచి ఈనాటి వరకూ పానకం ... వడపప్పును పంచడం వెనుక పరమార్థం లేకపోలేదు. శ్రీ రామనవమి నాటికి ఎండలు బాగా ముదురుతాయి. వేసవి తాపం వలన శరీరంలోని ఉష్ణోగ్రత పెరగడం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు తలెత్తుతుంటాయి. శరీరంలోని శక్తి చెమట రూపంలో బయటికి ఎక్కువగా పోవడం వలన నీరసం రావడం జరుగుతుంది.
ఇలాంటి అనారోగ్యాలను నివారించడం కోసమే ఈ రోజున బెల్లం పానకం ... పెసర బేడలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. బెల్లం పానకం ... పెసరబేడలతో వడపప్పును స్వీకరించడం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంటాయి. శరీరానికి కావలసిన చల్లదనాన్ని... పోషకాలను అందిస్తూ ఉంటాయి.
జీర్ణ సంబంధమైన ... మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా, వాత .. పిత్త ... కఫ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలా ఇవి పనిచేస్తుంటాయి. అందువలన బెల్లం పానకం ... వడపప్పే గదా అనే చులకన భావనతో ఇవి తీసుకోకుండా ఉండకూడదు. ఈ రోజున వీటిని తీర్థ ప్రసాదాలుగా స్వీకరించడం వలన సీతారాముల అనుగ్రహంతో పాటు ఆరోగ్య పరమైన ఔషధం లభించినట్టు అవుతుందని చెప్పొచ్చు.
మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా,ఆయా ఋతువులను,దేహారోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవే . వడపప్పు – పానకం కూడా అంతే. శరదృతువు, వసంత ఋతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఋతువులో వచ్చే గొంతువ్యాధులకు… పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని వైద్యశాస్త్రం చెబుతోంది.
పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని కూడా చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ దెబ్బ’ తగలకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. అందుకని ఒక్క శ్రీరామనవమి రోజునే కాకుండా ఈ వేసవి లో వడపప్పు ,పానకం తీసుకుంటే మంచిది .
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు

శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి

శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము.
వైదిక వివాహం ఇలా జరుగుతుంది అని లోకానికి చాటింది సీతారాముల కల్యాణమే. అప్పటివాళ్లు ఆ కల్యాణాన్ని చూసి ముగ్ధులైపోయారని పురాణాలు చెబుతున్నాయి. ఆ వైభవాన్ని చూసే అవకాశం లేని ఈ తరాల వారికి అ అదృష్టాన్ని తన పాట ద్వారా కలిగించిన సముద్రాల గారికి వందనం!
శ్రీ సీతారాముల కల్యాణం, చూతము రారండి
చూచు వారలకు చూడముచ్చటట- పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట…
భక్తి యుక్తులకు ముక్తిప్రదమట
ఆ…ఆ…ఆ…ఆ…[ఈ ఆలాపన అద్భుతం అంతే…]
భక్తి యుక్తులకు ముక్తిప్రదమట – సురలను మునులను చూడవచ్చునట…
కల్యాణం, చూతము రారండి

దుర్జన కోటిని దర్పమడంచగ – సజ్జన కోటిని సంరక్షింపగ…
ధారుణి శాంతిని స్థాపన చేయగ
ఆ…ఆ…ఆ…ఆ…
ధారుణి శాంతిని స్థాపన చేయగ – నరుడై వెలసిన పురుషోత్తముని…
కల్యాణం, చూతము రారండి

దశరథ రాజు సుతుడై వెలసీ, కౌశికు యాగము రక్షణ చేసీ,
జనకుని సభలో హరువిల్లు విరచీ
ఆ…ఆ…ఆ…ఆ…
జనకుని సభలో హరువిల్లు విరచీ – జానకి మనసు గెలిచిన రాముని
కల్యాణం, చూతము రారండి

సిరి కళ్యాణపు బొట్టును పెట్టీ…- మణి బాసికమును నుదుటను కట్టీ
పారాణిని పాదాలకు పెట్టీ…
ఆ…ఆ…ఆ…ఆ…
పారాణిని పాదాలకు పెట్టీ… – పెండ్లి కూతురై వెలసిన సీతా
కల్యాణం, చూతము రారండి

సంపగి నూనెను కురులను దువ్వీ – సొంపుగ కస్తూరి నామము దీర్చీ
చెంప జవ్వాది చుక్కను పెట్టి
ఆ…ఆ…ఆ…ఆ…
చెంప జవ్వాది చుక్కను పెట్టి – పెండ్లీ కొడుకై వెలసిన రాముని
కల్యాణం, చూతము రారండి…

రాముని దోసిట కెంపుల ప్రోవై, – జానకి దోసిట నీలపు రాశై…
ఆణిముత్యములు తలంబ్రాలుగా…
ఆ…ఆ…ఆ…ఆ…
ఆణిముత్యములు తలంబ్రాలుగా…శిరముల మెరిసిన సీతారాముల
కల్యాణం, చూతము రారండి… శ్రీ సీతా రాముల కల్యాణం, చూతము రారండి
సిరి కళ్యాణపు బొట్టును బెట్టి/మణిబాసికమును నుదుటను గట్టి/పారాణిని పాదాలకు బెట్టి అంటూ వధువు సీతాదేవి అలంకరణను అద్భుతంగా వర్ణించడం... సంపంగినూనెను కురులను దువ్వి/సొంపున కస్తూరి నామము దీర్చి/చెంప జవ్వాజి చుక్కను బెట్టి అంటూ వరుడు శ్రీరామచంద్రుడి రూపాన్ని కళ్లముందు నిలపడం . జానకి దోసిట కెంపుల ప్రోవై/రాముని దోసిట నీలపు రాసై/ఆణిముత్యములు తలంబ్రాలుగా సీతారాముల శిరముల మీద మెరిశాయట. చూచు వారలకు చూడముచ్చటట/పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట/భక్తి యుక్తులకు ముక్ తిప్రదమట/సురులను మునులను చూడవచ్చునట ... ఈ మాటలు వింటుంటే ఆ కల్యాణం జరిగే చోటికి వెళ్లిపోవాలని, స్వయంగా దర్శించాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది.
భోజనం చేశాక తాంబూలం వేయకపోతే ఎంత వెలితిగా ఉంటుందో... ఎంత ఖర్చుపెట్టి ఘనంగా పెళ్లి చేసినా, ఈ పాట వేయకపోతే ఆ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

సీతారామ కల్యాణం ఘట్టంలో మూడు సూత్రాల ప్రాముఖ్యత

సీతారామ కల్యాణం ఘట్టంలో మూడు సూత్రాల ప్రాముఖ్యత
చైత్ర మాసమున శుక్ల పక్షమినాడు సచ్చిదానంద స్వరూపియైన రామచంద్రుడు అవతరించెను. కావున ఆ రోజున ఉపవాసము ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశో పచారములచే ఆరాధించి పురాణమును పటించి (చదివి) జాగారణముచేసి (నిద్ర మేల్కొని) మరునాడు ఉదయముననే కాలకృత్యములు, నెరవేర్చుకొని తన శక్తికి తగిన భక్తి యుక్తులతో శ్రీరామచంద్రుని పూజించి పాయసముతో అన్నము చేసి పెద్ద వారిని, బంధువులను తృప్తి పరిచి కౌసల్యా పుత్రుడైన (కొడుకైన) శ్రీరామచంద్రుని ఆనందింపజేయవలెను.
సీతారామ కల్యాణం ఘట్టంలో ముందుగా రామునికి దేవాలయంలో ద్రువమూర్తుల కల్యాణం చేస్తారు. తరువాత మంగళ వాయిద్యాలు మారు జయజయధ్వానాల మధ్య పల్లకీలో కల్యాణ మండపానికి స్వామివారు తరలివస్తారు. ముందుగా తిరుకల్యాణానికి సంకల్పం చేసి సర్వవిజ్ఞాన శాంతికై విశ్వక్సేణ పూజ నిర్వహిస్తారు. విష్ణుసంబంధమైన అన్ని పూజా శుభ కార్యక్రమాలకు విశ్వక్సేణుని పూజ చేయడం ఆనవాయితీ. తరువాత పుణ్యఃవచనం చేస్తారు. మంత్ర పూజలలో కల్యాణానికి వినియోగించే సకల సామగ్రినీ సంప్రోక్షణ చేస్తారు. ఆ తరువాత రక్షాబంధనం, మోక్షబంధనం నిర్వహిస్తారు. 24 అంగుళాల పొడవుగల 12దర్భలతో అల్లిన ఒక దర్భతాడును సీతమ్మవారి నడుముకు బిగిస్తారు. మాత్రావాహితమైన ఈ మోక్రమును ధరించినట్లయితే ఉదర సంబంధమైన అన్ని రోగాలు నశించి స్త్రీలు సంతానవతులవుతారని ప్రతీతి.
రామయ్య కుడిచేతికి, సీతమ్మకు ఎడమ చేతికి రక్షాసూత్రాలు కడతారు. స్వామి గృహస్థాశ్రమసిద్ధి కోసం సువర్ణయజ్ఞోపవితాన్ని ధరింపచేస్తారు. 8మంది వైష్ణవులకు తాంబూలాది సత్కారాలను చేసి కన్యావరణం చేస్తారు. అంటే జగన్నాథుడు దయామయుడు అయిన శ్రీరామచంద్రునికి దయాస్వరూపిని సీతమ్మే తగు వధువు అంటూ పెద్దలు నిర్ణయిస్తారు. తరువాత వధూవరుల ఇరు వంశాల పెద్దల గోత్రాలను ముమ్మారు పటిస్తారు. పాదప్రక్షాళన అనంతరం పరిమల భరిత తీర్థంతో మంత్రోక్తంగా పుష్పోదక స్నానం చేయిస్తారు. గోదానం చేసి మహాసంకల్పం పఠిస్తారు.
కల్యాణంలో పఠించే ఈ మహాసంకల్పం భారతీయ భౌగోళిక పరిజ్ఞానానికి అద్దం పడుతూ... జాతీయ భావన సామ్యాన్ని మనలో పటిష్టపరుస్తుంది. ఈ మహాసంకల్పానికి అనుగుణంగా కన్యాదానం జరుగుతుంది. సాక్షాత్ విష్ణుస్వరూపుడైన శ్రీరామునికి శ్రీ మహాలక్ష్మీ స్వరూపమైన సీతను జగత్కల్యాణార్థ్ధం మంత్రధార పూర్వకంగా ఈ కన్యాదానం జరుగుతుంది. మంగళాష్టకాలు పఠిస్తారు. అందరు ఈ వధూవరులకు మంగళం చేకూర్చాలనే భావనతో చదివే ఈ ఆశీస్సులు ఒక్క సీతారాములకే కాక వారి కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులందరికీ వర్తించే విధంగా ఉంటాయి.
మంగళవాయిద్యాలు మారుమోగుతుండగా.. మంత్రాల మధ్య అభిజిత్‌లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచుతారు. ఇది శుభలగ్నం. జగత్కల్యాణ శుభసన్నివేషం. ఈ జీలకర్ర, బెల్లం శిరస్సుపై ఉంచితే మనలో సత్యం, సద్భావనము పెంచుతుందని శాస్త్రం చెబుతోంది. ఆ తరువాత జరిగే మాంగళ్య పూజలో మంగళసూత్రంతో ముగ్గురు అమ్మవార్లను ఆవాహనం చేస్తారు. మనుషులకైతే రెండు సూత్రాలు, దేవతలకైతే మూడు సూత్రాలు ఉండాలని శాస్త్రం చెబుతుంది. తొమ్మిది పోగులతో మూడు సూత్రాలతో తయారయ్యే మంగళసూత్రం ఎన్నో వేదాంత రహస్యాలను చాటి చెబుతుంది. తొమ్మిది పోగులు వివిధ సంబంధాలకు ప్రతీకలు.
మూడు సూత్రాలు కర్మ, జ్ఞాన, భక్తిమార్గాలకు సంకేతాలు. సూత్రమూలములో గౌరీదేవిని, సూత్రమధ్యములో సరస్వతిని, సూత్రాగ్రంలో మహాలక్ష్మిని ఆవాహనం చేస్తారు. ఈ ముగ్గురమ్మల అనుగ్రహంతోనే లోకంలో సౌశీల్యం, సౌందర్యం, సౌకుమార్యం వంటి గుణాలు వర్థిల్లుతున్నాయని ప్రతీతి. ఈ ముగ్గురమ్మలను ఆవాహనం చేసిన మంగళసూత్రాలలో భక్తరామదాసు చేయించిన మంగళపతకాన్ని కలిపి ధరింపచేయడం ఆచారం. రామదాసు చేయించిన ఆభరణాలను నేటికీ మనం స్వామివారికి అలంకరించి ఆనందిస్తున్నాం. భక్త రామదాసు సీతామ్మవారికి చేయించిన చింతాకు పతకం, పచ్చల హారం, పూసలహారం, అమ్మవారి మంగళసూత్రాలు, రామటంకాలు, చంద్రపతకం, బంగారు మొలత్రాడు, తదితర ఆభరణాలు కల్యాణ మహోత్సవంనాడు శ్రీ సీతారామచంద్ర స్వామికి అలంకరిస్తారు.
ప్రభుత్వ సొమ్మును ఖజానాకు జమచేయకుండా ఆలయం నిర్మించడం అప్పటి నిజాంప్రభువు తానీషాకు ఆగ్రహం తెప్పించింది. రామదాసును గోల్కొండ కోటలో బందీగా వుంచి, చిత్రహింసలకు గురిచేశాడు. ఆ సమయంలో తనను కాపాడమని రామదాసు శ్రీ రామచంద్రుని వేడుకున్నాడు. శ్రీరామ చంద్రునికి చెప్పి తనను రక్షించమని సీతాదేవినీ వేడుకున్నాడు. ఎంతకీ శ్రీరాముడు కరుణించక పరోవడంతో తాను నిత్యం కొలిచే శ్రీరామ చంద్రునే నిందించడం ప్రారంభించాడు. సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకంబు రామచంద్రా… అంటూ , ఎవరబ్బాసొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా ..అని నిందాపూర్వకంగా వేడుకుంటాడు. చివరకు శ్రీరామచంద్రులు తన సోదరుడు లక్ష్మణునితోసహా రామోజీ, లక్ష్మోజీల పేర్లతో తానీషాకు ప్రత్యక్షమై రామదాసు చెల్లించవలసిన ఆరులక్షల వరహాలను చెల్లించి కారాగారవాసం నుంచి రామదాసును విముక్తిన్ని చేశారు.
అలనాడు తానీషా కాలం నుంచి ఆచారంగా వస్తున్న ముత్యాల తలంబ్రాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతీఏటా సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తరువాత బ్రహ్మాబంధనం వేస్తారు. దానినే బ్రహ్మముడి అని కూడా అంటారు. అనురాగ పూర్వకమైన దాంపత్య బంధానికి ఇది సంకేతం. ఆ తరువాత శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి గోదాదేవి శ్రీరంగనాథునితో కల్యాణం జరిగినట్లు కలగన్న వైవాహిక స్వప్నం వారణమాయురం అన్న పది తమిళ పద్యాలు పాడుతూ...అర్చక స్వాములు బంతులాట ఆడుతారు. అనంతరం సీతారాములకు కర్పుర నీరాజనం సమర్పిస్తారు. చతుర్వేదాలలో సీతారాములకు ఆశీర్వచనం ఇవ్వడంతో ఈ కల్యాణ క్రతువు పూర్తవుతుంది.
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు

Sunday, 10 April 2016

రుక్మిణీ కళ్యాణం

1. ముందుగా శ్రీకృష్ణుని నిత్యపూజచేసి రుక్మిణీ కళ్యాణం పారాయణం ప్రారంభించాలి.
2. శ్రీకృష్ణ నిత్యపూజ చేయలేని వారు కనీసం కృష్ణ అష్టోత్తరము మరియు కృష్ణాష్టకము ఖచ్చితముగా చదవాలి.
3. మీ జన్మనక్షత్రము రోజుగాని, లేదా నామనక్షత్రము రోజుగాని పారాయణ ప్రారంభించండి.
4. వీలయినంతవరకు శుక్రవారం, గురువారాలలో పారాయణ ప్రారంభించండి.
మీకు వివాహము నిశ్చయము కాగానే ఎనిమిదిమంది కన్యలను పిలిచి (శ్రీకృష్ణుని అష్టభార్యలుగా భావించి) చందన తాంబూలములతో రుక్మిణీ కళ్యాణం అను పుస్తకములు దానముగా ఇవ్వండి శ్రీకృష్ణుని అనుగ్రహం ఖచ్చితముగా లభిస్తుంది.
పెళ్లి ఆలస్యమవుతున్న మగ పిల్లల కొరకు
పెళ్లి ఆలస్యం అవుతున్న అమ్మాయిలకు ( రుక్మిణీ కళ్యాణం - చదివితే త్వరగా
పెళ్లి అవుతుందనీ , లలితా దేవిని పూజించమనీ ఇలా ) చాలా పరిష్కార మార్గాలు
మన పెద్దలు చెప్పారు. కానీ పెళ్లి కాని అబ్బాయిలకు ఏదైనా పరిష్కార
మార్గాలు ఉన్నాయా అని నాకు చాలా సందేహంగా ఉండేది. ఎందుకంటే నేటి కాలంలో
అమ్మాయిలకు డిమాండు ఎక్కువగా ఉంది. అమ్మాయిల సంఖ్య తక్కువ, అబ్బాయిల
సంఖ్య ఎక్కువ. అందువలన ఇప్పుడు అబ్బాయికి పెళ్లి అవ్వడం కష్టమైపోయింది.
అందునా మంచి భార్య లభించడమంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. అందువలన
అటువంటి అదృష్టాన్ని కలిగించే ఉపాయమేమైనా ఉన్నదా అని ఎంతో కాలంగా
వెతుకుతున్నాను.
అలా వెతకగా వెతకగా చివరికి ఆ పరమేశ్వరునికి నాయందు దయ కలిగి ఈ
స్తోత్రాన్ని ప్రసాదించారు. క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి
ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక
దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి
వంతమైనది. కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేసి ప్రతీ శుక్రవారమూ
అమ్మ వారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టిన వారికి ఎంత
కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి. వివాహము
ఆలస్యమవుతున్న మెగ వారికి అతి త్వరలో సౌందర్య వతి అయిన, అనుకూల వతి అయిన
కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీ దేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు
సంశయము లేదు. ఇంకా దీని వలన కలుగు సంపదలు అన్నీ ఇన్నీ అని చెప్పనలవి
కాదు.

శివరాత్రి రోజున శివునికి అభిషేకం ఎలా చేయాలంటే..!?

శివరాత్రి రోజున శివునికి అభిషేకం ఎలా చేయాలంటే..!?
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు
శ్లో|| పుర్రె చేసిన పుణ్యమేమో! పంచ చేరి నీకు కంచమాయే !
వల్లకాటి భాగ్యమేమో ! తనకు తానే నీకు మంచమాయే !
అన్నట్లు శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. పదార్థాలు ఏవైనప్పటికీ శివుడు ముమ్మాటికీ అభిషేక ప్రియుడంటున్నారు.
ఈ క్రమంలో మహాశివరాత్రి రోజున ఏ పదార్థాలతో శివునిని అభిషేకిస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో చూద్దాం.. కస్తూరి, జవ్వాది, పునుగు, గులాబీ అత్తరు కలిపిన జల మిశ్రమంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివసాయుజ్యం లభిస్తుంది. పలురకాల పువ్వులతో శివాభిషేకం నిర్వహిస్తే రాజభోగం కలుగుతుంది. వెండిధూళి లేదా వెండి రజనుతో శివాభిషేకం చేస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది.
నవధాన్యములతో శివాభిషేకం చేసినట్లయితే ధన, భార్యా, పుత్రలాభం, పటికబెల్లపు పలుకులతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఉప్పుతో అభిషేకించితే సౌభాగ్యం చేకూరుతుంది. విభూదితో చేసే అభిషేకం వలన సర్వకార్యాలు లాభిస్తాయి. బెల్లపు పలుకులతో అభిషేకం చేసినట్లయితే ప్రేమవ్యవహారాల్లో జయము కలుగుతుంది.
వెదరు చిగుళ్ళతో అభిషేకం చేస్తే వంశవృద్ధి, పాలాభిషేకం వలన కీర్తి, సిరి, సుఖములు కలుగును. మారేడు చెట్టు బెరడు, వేర్ల నుంచి తీసిన భస్మంతో చేస్తే దారిద్రనాశనమవుతుంది.
ఇక పలురకాల పండ్లతో చేసే అభిషేకం జయాన్నిస్తుంది. ఉసిరికాయలతో చేస్తే మోక్షము, బంగారుపొడితే అభిషేకం చేస్తే మహాముక్తి లభిస్తుంది. అష్టదాతువులతో చేసే అభిషేకం వలన సిద్ధి, మణులతో, వాటి పొడులతో అభిషేకించితే అహంకారం తొలగిపోతుంది. పాదరసముతో అభిషేకించితే అష్టైశ్వర్యములు లభిస్తాయి. ఆవునెయ్యి, ఆరు పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే ఆయుర్ వృద్ధి కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు.
శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ యొక్క ప్రాధాన్యత!
మహాశివరాత్రి రోజున ప్రధానం మూడు పద్ధతుల్లో పరమేశ్వరుడిని అర్చించాలని పండితులు అంటున్నారు. వీటిలో మొదటిది శివార్చన, రెండోది ఉపవాసం, మూడోది జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే (ఐదు గంటలకు) నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలను నెరవేర్చుకుని, పూజామందిరం, గృహాన్ని శుభ్రం చేసి.. పసుపు కుంకుమలు, రంగవల్లికలు. తోరణాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు వస్త్రాలు ధరించి శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులతో పాటు ఇతరులకు అన్నదానం చేయాలి. శివాలయానికి వెళ్లి శివదర్శనం చేసుకోవాలి.
"శివరాత్రి"లో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి.
ఒకటి: "ఉపవాసం", రెండు: "జాగరణ".
ఇక ఉపవాసం సంగతికొస్తే.. ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణం చేస్తూ.. "ఉప-సమీపే"- అతడికి (శివుడికి) దగ్గరగా ఉండటం. అంతేగాని ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు పేర్కొంటోంది. ఇక జాగారం ఎలా చేయాలంటే..? శివరాత్రి నాటి సూర్యాస్తమం మొదలు మరునాడు సూర్యోదయం వరకు- నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటమని అర్థం. ఈ విధంగా జాగారం చేసినవారికి మళ్లీ తల్లి పాలు తాగే అవసరం లేకుండా, పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది.
జాగారం చేసే సమయంలో భగవన్నామ స్మరణం చేస్తే సమస్త పాపాలు హరిస్తాయని విశ్వాసం. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాల తోనో, ఎటువంటి ప్రయోజనమూ లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివగాథలను చదువుకుంటూ చేసినట్లైతే ఆ కాలాన్ని సద్వినియోగ పరచుకొన్నట్లతే పుణ్యం ప్రాప్తిస్తుందని పురోహితులు అంటున్నారు.
ఇక గృహంలో శివరాత్రి పూజ ఎలా చేయాలంటే...? లింగాకారము గల ప్రతిమను దివ్య సుందరంగా అలంకరించుకుని, ఆ లింగానికి తెలుపు పువ్వులు, వస్త్రాలతో అలంకరించుకోవాలి. పూజకు మారేడు ఆకులు, తెల్లపూలమాల.. నైవేద్యమునకు పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను సిద్ధం చేసుకోవాలి. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పూజను ప్రారంభించి మరుసటి రోజు ఆరు గంటల వరకు శివధ్యానముతో పూజించాలి.
జాగారం చేసే వారు శివ అష్టోత్తరము, శివ పంచాక్షరీ స్తోత్రం, దారిద్ర్యదహన స్తోత్రం, శివసహస్రనామము, శివారాధన, శివపురాణములతో లేదా "ఓం నమఃశివాయ" అనే పంచాక్షరీతో 108 సార్లు మహేశ్వరుడిని పూజించడం మంచిది. అలాగే శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, శివధ్యానములు చేయడం మోక్షఫలం చేకూరుతుందని పండితుల వాక్కు.
ఇంకా ఆలయాల్లో ఏకాదశరుద్రాభిషేకం, 108 బిందెలతో రుద్రాభిషేకం, శివ కళ్యాణం చేయిస్తే వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు, విశేష పుణ్యఫలితాలు దక్కుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత పరమేశ్వరుడిని మహాశివరాత్రినాడు భక్తి శ్రద్ధలతో పూజించి, ఆ దేవదేవుని అనుగ్రహం పొందండి.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు.
పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం ఇలా వివరించబడినది.పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు.దీనితో వర గర్వముతో దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా దీనితో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్ధించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు వల్లనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు.యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగమును చేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును చేదిస్తాడు.దీనితో తారకాసురుడు మరణిస్తాడు.చేదించగా ఆ ఆత్మలింగము వేరై ఐదు ప్రదేశములలో పడుతుంది. తరువాత వాటిని ఆఅ ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠ ఛేస్తారు. ఇవే పంచారామాలు.
1.దాక్షారామము -
పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు.స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పైఅంతస్తు నుండి పూజలు నిర్వహించాలి.ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు సగభాగం నలుపుతో ఉంటుంది.
ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన భీముడు నిర్మించాడని తెలుస్తుంది.అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతోమంది దేవతలు,రాజులు స్వామి వారిని దర్శించి తరించారని తన భీమేశ్వర పురాణంలో రాసాడు.ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
2.అమరారామము -
పంచారామల్లో రెండవదైన అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణా తీరమునందు కలదు.ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు.గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది.ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది.
గర్భగుడిలోని విగ్రహాన్ని తారకాసురుని సమ్హారం అనంతరం కంఠంలోని శివుని ఆత్మలింగం చెల్లాచెదురు అవ్వగా దానిలోని ఒభాగాన్ని అమరేశ్వరుడైన ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్టించి తన నగరమైన అమరావతినే దీనికి పెట్టాడంటారు.
3.క్షీరారామము -
క్షీరారామము పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీరారామ లింగేశ్వర స్వామి అని పిలుస్తారు.
ఇక్కడ స్వామి వారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు ఇద్దరూ ప్రతిష్ఠించారట.ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది. శివుడు తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమినుండి పాలదార ఒకటి వచ్చిందట క్షీరం అనగా పాలు దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది.క్రమంగా క్షీరపురి కాస్తా పాలకొల్లుగా మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు.ఆలయం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలుతో కట్టబడింది.
4.సోమారామము -
పంచరామాల్లో నాల్గవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు.ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.
ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్టించాడు.చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి సోమారామము అని పేరు వచ్చింది.
5.కుమార భీమారామము -
పంచారామాల్లో చివరిదైన కుమారభీమారామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు.ఇక్కడ స్వామిని కాల బైరవుడు అని పిలుస్తారు.
ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజయిన భీముచే ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చెయ్యబడింది.ఈ ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

మహా శివరాత్రి వ్రత మహాత్యం

మహా శివరాత్రి వ్రత మహాత్యం
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు
మహా శివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవటం పురాణకాలం నుండి వస్తోంది. ఈ వ్రతం చేసేవారి చెంతన నిరంతరం శివుడుంటూ చింతలు తీరుస్తాడు. ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసే వారికి ముక్తి లభిస్తుంది. కేవలం మహాశివరాత్రినాడే కాక ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ తరువాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది. భక్తి, ముక్తి సొంతమవుతాయి. ఇంతటి పుణ్యఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తూ ఆ శివుడే.
ఓసారి బ్రహ్మ, విష్ణువు, పార్వతీ నేరుగా శివుడినే ఏ వ్రతం చేస్తే మానవులకు శివుడు భక్తిని, ముక్తిని కలిగించటం జరుగుతుందని ప్రశ్నించారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు చేసిన వారికే కాక చూసిన వారికీ, విన్నవారికీ కూడా పాప విముక్తిని కలిగించే శివరాత్రి వ్రతాన్ని గురించి, దాన్ని ఆచరించాల్సిన పద్ధతి గురించి తెలియచెప్పాడు. భక్తిని, ముక్తిని మానవులకు కలిగించే శివ సంబంధ వ్రతాలు చాలా ఉన్నాయి.
జాబాల శ్రుతిలో రుషులు పది శైవవ్రతాలను గురించి చెప్పారు. శివపూజ, రుద్రజపం, శివాలయంలో ఉపవాసం, వారణాసిలో మరణం అనే నాలుగు సనాతనమైన ముక్తి మార్గాలు, అష్టమి తిథితో కూడిన సోమవారం, కృష్ణపక్షం నాటి చతుర్ధశి శివుడికి ఎంతో ప్రీతికరం.ఇవన్నీ ఓ ఎత్తైతే శివరాత్రి వ్రతం అన్నిటికంటే గొప్పది. ఎలాగో ఒకలాగా మనిషి పట్టుపట్టి ఈ వ్రతాన్ని చెయ్యటం మంచిది. ధర్మసాధనలన్నిటిలో ఉత్తమమైనదని దీనికి పేరు. ఏ భేదమూ లేకుండా సర్వవర్ణాలవారు, అన్ని ఆశ్రమాలవారు, స్త్రీలు, పిల్లలు ఒకరనేమిటి దీన్ని ఎవరైనా చేసి మేలు పొందవచ్చు.
మాఘమాసం కృష్ణపక్షంలో ఈ వ్రతం చేయటం శ్రేష్ఠం. రాత్రి అంతా ఈ వ్రతాన్ని చేయాలి. శివరాత్రి పూట ఉదయాన నిద్రలేవగానే శివుడి మీదనే మనస్సును లగ్నంచేయాలి. శుభ్రంగా స్నానం చేశాక శివాలయానికి వెళ్ళి శివపూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజాద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్న చోటికి వెళ్ళి సమకూర్చుకొన్న పూజాద్రవ్యాలను అక్కడ ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ స్నానం, లోపల, బయట అంతాపరిశుభ్ర వస్త్రధారణలతో శివపూజకు ఉపక్రమించాలి. శివాగమ ప్రకారం పూజను చేయటం మంచిది. దీనికోసం ఉత్తముడైన ఆచార్యుడిని ఎంచుకోవాలి. ఏ మంత్రానికి ఏ పూజాద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలోమాత్రమే పూజ చేయాలి. మంత్రం లేకుండా పూజించకూడదు.
భక్తి భావంతో గీత, వాద్య, నృత్యాలతో ఇలా ఆ రాత్రి తొలి యామం(జాము) పూజను పూర్తిచేయాలి. శివమంత్రానుష్ఠానం ఉన్నవారు పార్థివ లింగాన్ని పూజించాలి. ఆ తర్వాత వ్రతమాహాత్మ్య కథను వినాలి. ఈ పూజ నాలుగు జాములలోనూ ఆ రాత్రి అంతా చెయ్యాల్సి ఉంటుంది. వ్రతానంతరం యధాశక్తిగా పండితులకు, శివభక్తులకు విశేషించి సన్యాసులకు భోజనాన్ని పెట్టి సత్కరించాలి. నాలుగు జాములలో చేసే పూజ కొద్దిపాటి భేదంతో ఉంటుంది. తొలి జాములో పార్థివ లింగాన్ని స్థాపించి పూజించాలి. ముందుగా పంచామృతాభిషేకం, ఆ తర్వాత జలధారతో అభిషేకం నిర్వహించాలి.
చందనం, నూకలు లేని బియ్యం, నల్లని నువ్వులతో పూజచేయాలి. ఎర్రగన్నేరు, పద్మంలాంటి పుష్పాలతోఅర్చించాలి. భవుడు, శర్వుడు, రుద్రుడు, పశుపతి, ఉగ్రుడు, మహాన్‌, భీముడు, ఈశానుడు అనే శివదశ నామాలను స్మరిస్తూ ధూప దీప నైవేద్యాలతో అర్చన చేయాలి. అన్నం, కొబ్బరి, తాంబూలాలను నివేదించాలి. అనంతరం ధేను ముద్రను చూపి పవిత్ర జలంతో తర్పణం విడవాలి. అనంతరం అయిదుగురు పండితులకు భోజనం పెట్టడంతో తొలిజాము పూజ ముగుస్తుంది.
రెండోజాములో తొలిజాముకన్నా రెట్టింపు పూజను చేయాలి. నువ్వులు, యవలు, కమలాలు పూజా ద్రవ్యాలుగా ఉండాలి. మిగిలిన పద్ధతంతా తొలిజాములాంటిదే.
మూడో జాములో చేసే పూజలో యవలస్థానంలో గోధుమలను వాడాలి. జిల్లేడు పూలతో శివపూజ చేయాలి. వివిధ ధూపదీపాలను. శాకపాకాలను, అప్పాలను నివేదించాలి. కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత దానిమ్మ పండుతో అర్ఘ్యం ఇవ్వాలి. పండిత భోజనాలన్నీ అంతకు ముందులాగే ఉంటాయి.
నాలుగోజాములో పూజాద్రవ్యాలుగా మినుములు, పెసలు లాంటి ధాన్యాలను,శంఖ పుష్పాలకు, మారేడు దళాలను వాడాలి. నైవేద్యంగా తీపి పదార్థాలను కానీ, మినుములతో కలిపి వండిన అన్నాన్నీ కానీ పెట్టాలి. అరటిపండు లాంటి ఏదో ఒక ఉత్తమమైన పండుతో శివుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా భక్తి పూర్వకంగా నాలుగు జాములలోనూ ఒక ఉత్సవంలాగా శివరాత్రి వ్రతాన్ని చేయాల్సి ఉంటుంది. ఏ జాముకుఆ జాము పూజ పూర్తికాగానే ఉద్వాసన చెప్పటం, మళ్ళీ తరువాతి జాము పూజకు సంకల్పం చెబుతుండాలి.
నాలుగు జాముల శివరాత్రి వ్రతం ముగిశాక పండితులకు పుష్పాంజలి సమర్పించి వారి నుండి తిలకాన్ని, ఆశీర్వచనాన్ని స్వీకరించి శివుడికి ఉద్వాసన చెప్పాలి. ఈ వ్రతక్రమాన్ని శాస్త్రం తెలిసిన ఆచార్యుడి సహాయంతో క్రమం తప్పకుండా చేయటం మంచిది. ఇలా చేసిన భక్తుల వెంట తాను నిరంతరం ఉంటానని సర్వశుభాలు, సుఖాలు కలిగిస్తానని శివుడు బ్రహ్మ, విష్ణు, పార్వతులకు వివరించి చెప్పాడు. ఈ కథా సందర్భం వల్ల యుగయుగాలుగా శివరాత్రి వ్రతం ఆచరణలో ఉందన్న విషయం స్పష్టమవుతుంది.

లింగోద్భవo

లింగోద్భవo
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు
సర్వేశ్వరుడైన ఈశుడు లింగస్వరూపుడూ అందులోనూ తేజో లింగస్వరూపుడై అవతరించిన మరుక్షణంలోనే మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చాడని వివరించే ఈ కథా సందర్భం శివపురాణంతో పాటు ఇతర పురాణాలలో కూడా ప్రస్తావితమై ఉంది.
ఒక్క శివలింగానికి కాసింత పూజను, అభిషేకాన్ని ఏ రోజు చేసినా పుణ్యఫలమే. అందులోనూ శివరాత్రి వేళ లింగోద్భవ సమయంగా చెప్పే సమయంలో ఇక అలాంటి పూజలు, అభిషేకాలు చేస్తే ఎంత గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమేముంటుందని పురాణజ్ఞులు, పండితులు అంతా అనేమాట వాస్తవమే. అసలు మనిషి దైవ సందేశాన్నందుకొని లోక యాత్రలో పుణ్య పురుషుడుగా మెలగాలన్నదే మన ఆర్షవాణి, సంప్రదాయ పర్వదినాల అవతరణలో అసలు విషయం. ఇక లింగోద్భవ సమయంలో శివుడిచ్చిన సందేశమేమిటి? ఆ భవుడికి, భవనాశనుడికి, శంకరుడికి నచ్చనిది ఏది? అనే విషయం కూడా ఇక్కడ ప్రస్తావితమై కనిపిస్తుంది.
పూర్వం ఓసారి బ్రహ్మకు, విష్ణువుకు తాను గొప్పంటే తాను గొప్పన్న అహంకారం కలిగింది. అది కాస్త తీవ్ర రూపం దాల్చి యుద్ధ స్థాయికి చేరింది. లోకాలన్నీ ఆ తగవులాటవల్ల భీతిల్లుతున్న తరుణంలో చంద్ర శేఖరుడు హరిబ్రహ్మలకు జ్ఞానాన్ని ప్రసాదించాలనుకున్నాడు. వెంటనే వారి ముందు ఒక దివ్యతేజోరాశిని ఆద్యంతాలు తెలియని స్తంభలింగరూపంలో అవతరించేలా చేశాడు. అప్పటిదాకా అక్కడ లేని ఆ దివ్యతేజోస్తంభం ఏమిటా అని హరి, బ్రహ్మలు యుద్ధంమాని విస్తుపోతూ చూశారు. వెంటనే పార్వతీ వల్లభుడు తన దివ్యలీలా విలాసంతో వారికి ఓ పరీక్ష పెడుతున్నానని, ఆ స్తంభం (లింగం) అగ్రభాగాన్ని ఒకరు, అడుగు భాగాన్ని మురొకరు చూసి రావాలని, ఎవరు ముందుగా వస్తే వారే గొప్పని, వారికే సర్వాధిపత్యం అని చెప్పాడు. వెంటనే బ్రహ్మ హంసరూపుడై ఆ తేజోలింగం అగ్రభాగానికి చేరటానికి వెళ్ళాడు. విష్ణువు వరాహరూపుడై ఆ లింగం మూలం ఎక్కడుందో తెలుసుకోవటానికి పాతాళం వైపు ప్రయాణం చేశాడు.
హరి, బ్రహ్మలకు ఆ దివ్యతేజో రాశి ఆద్యంతాలు ఎంతకీ అంతు పట్టలేదు. ఇంతలో పై నుండి ఒక కౌతకి (మొగలిపువ్వు) రావటం హంస రూపంలో ఉన్న బ్రహ్మ చూశాడు. బ్రహ్మ మొగలి పువ్వును ప్రలోభపెట్టి తాను ముందుగా తేజో రాశి అగ్రభాగాన్ని చూశానని చెప్పుకోవటానికి సాక్ష్యంగా ఉండమని కోరాడు. పాతాళం వైపు వెళ్ళిన విష్ణువుకు తేజోరాశి పీఠభాగం ఎంత దూరం వెళ్ళినా కనిపించలేదు. ఇంతలో అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు మొగలి పువ్వును వెంట పెట్టుకొని శివుడి దగ్గరకొచ్చాడు. బ్రహ్మ, ఆ తర్వాత కొద్ది సేపటికి విష్ణువు తేజోలింగం అడుగు భాగం తాను కనుక్కోలేకపోయానని బాధపడుతూ పై కొచ్చాడు. శివుడికి బ్రహ్మ తేజోరాశి అగ్రభాగాన్ని తాను చూశానని అందుకు సాక్ష్యంగా కేతకిని కూడా వెంటపెట్టుకొచ్చానన్నాడు. ఆ అసత్య మాటలకు శివుడికి కోపం ముంచుకువచ్చిది. వెంటనే భైరవుడిని సృష్టించి అసత్యమాడినందుకు బ్రహ్మను దండించమన్నాడు.
భైరవుడు అప్పటిదాకా బ్రహ్మకున్న ఐదుతలలలో అబద్ధం ఆడిన తలను తుంచేశాడు. తరువాత తప్పును తెలుసుకున్న బ్రహ్మ ఈశుడిని శరణు వేడుకొన్నాడు. పక్కనే ఉన్న విష్ణువు కూడా అప్పటికే శివుడి గొప్పప్పతనాన్ని గ్రహించి శివుడికి నమస్కరించాడు. బ్రహ్మ తప్పును క్షమించమని కూడా వేడుకున్నాడు. శరణాగత వత్సలుడైన శంకరుడు చల్లబడ్డాడు. ఇంతకు ముందు లాగానే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని, అయితే ఇతర దేవతల్లాగా బ్రహ్మకు ఆలయాలు, పూజలు ఏవీ ఉండవని చెప్పాడు. అబద్ధం ఆడకుండా వాస్తవాన్ని తెలిపిన విష్ణువు అందరి చేత పూజలందుకుంటాడని, స్థితి కారకుడిగా వెలుగొందుతాడని అన్నాడు.
మొగలిపువ్వును చూసి అసత్యమాడిన పాపానికి తన పూజలో మొగలిపువ్వుకు చోటుండదని అన్నాడు. అయితే ఆ కేతకి శివుడికి పరిపరివిధాల ప్రణమిల్లింది. భక్తవత్సలుడైన శివుడు అప్పుడు కొంత శాంతించి శివపూజకు పనికి రాకపోయినా శివభక్తులు మాత్రం మొగలిపువ్వును ధరిస్తారని, అలా జన్మను చరితార్థం చేసుకోమని చెప్పి అంతర్థానమయ్యాడు. ఈ కథా సందర్భంలో ఎంతటి వారైనా అసత్యమాడితే పాపఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలియజెప్పే సందేశం ఇమిడి ఉంది. మానవులాంతా సత్యమార్గంలోనే నడుచుకోవాలన్న ఈశ్వర సందేశం ఇక్కడ కనిపిస్తోంది.

సంపూర్ణ సూర్య గ్రహణ శాంతికి తీసుకోవలసిన జాగ్రత్తలు

సంపూర్ణ సూర్య గ్రహణ శాంతికి తీసుకోవలసిన జాగ్రత్తలు
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు
సూర్య గ్రహణము అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. అన్నీ అమావాస్యలకు సూర్యగ్రహణం ఏర్పడదు. సూర్యుడు, చంద్రుడు అమావాస్యనాడు భూమికి ఒకవైపు ఉంటారు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపై ఉండి చంద్రుడు రాహువు లేదా కేతువుస్ధానంలో ఉన్నప్పుడు మాత్రమే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. పూర్తి సూర్యగ్రహణ సమయం 8 నిమిషాలకు మించి ఉండదు. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్లనే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీంతో భూమిమీద కొంత భాగానికి సూర్యుడు కనిపించకుండా పోతాడు. సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించే సమయంలో స్థానిక ఉష్ణోగ్రత కూడా భారీగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మనదేశంలోనివారు "రాహువు" అనే రాక్షసుడు సూర్యుడిని మింగేయటంవల్లనే గ్రహణం ఏర్పడుతుందని బలంగా నమ్ముతారు.
ఆధ్యాత్మికంగా గ్రహణం సమయానికి చాలా విశేషముంది. గ్రహణం పట్టగానే నదీ స్నానం చేసి, నదీ తీరాన జపం చేసుకుంటే ఆ ఫలితం ఇంకా ఎక్కువ. గ్రహణ స్పర్శ కాలమున నదీస్నానం, మద్యకాలమున తర్పణం, జపము, హోమం, దేవతార్చన విడువుచుండగా దానం, స్నానం చేయటం మంచిది. గ్రహణ కాలమున భాగవన్నామస్మరణ చేయటం ఉత్తమం. గురువు ఉపదేశించిన మంత్రజపము, వశీకరణం, శత్రుపీడనం నుంచి విముక్తి లభించేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు గాయత్రి మంత్ర జపము గ్రహణ కాలమందు మరియు ఏడురోజుల వరకు తప్పనిసరిగా ఆచరించవలెను. గ్రహణం రోజు ఉపవాస దీక్ష చేస్తే మంచిది. గ్రహణ సమయమందు గో భూ హిరణ్యాది (గోవులను, భూములను, బంగారాన్ని) దానములు చేయవలెను.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జన్మ నక్షత్ర, రాశ్యాదులలో గ్రహణం చెడు ఫలితాలను ఇస్తుంది. ఎవరి జన్మరాశి యందు, జన్మ నక్షత్రమందు గ్రహణం కలుగునో వారికి విశేషముగా పూజలు, జపాలు, దానాలు చేసుకోవలెను. గ్రహణం పడిన నక్షత్రమందు ఆరు నెలలు ముహూర్తాలు నిషేదిస్తారు. జన్మరాశి నుండి 3,6,10,11 రాసులలో గ్రహణమైన శుభప్రధం 2,5,7,9 రాసులందు గ్రహణమైన మధ్యమం. మిగిలిన రాసులందు గ్రహణమైన అరిష్టం.
మతాంతరంలో గర్గుడు జన్మరాశి నుండి 7,8,9,10,12 లలో గ్రహణమైతే అరిష్టమని, రాహువు జన్మ నక్షత్రమందు లేదా 7 వ నక్షత్రమందు ఉన్న అరిష్టం అని తెలియజెప్పాడు.
మరొక మతాంతరంలో రాహువు ఏ నక్షత్రంలో ఉండి సూర్య,చంద్రులను మ్రింగుతాడో ఆ నక్షత్ర జాతకులకు చెడు జరుగుతుందని తెలియజెప్పారు.
మరొక మతాంతరంలో గ్రహణం త్రిజన్మ నక్షత్రాలలో అనగా జన్మ నక్షత్రానికి ముందు నక్షత్రం, వెనుక నక్షత్రాలలో పడుతుందో రోగం సంభవిస్తుందని చెప్పటం జరిగింది. సూర్యగ్రహణ ప్రభావం ఆరు నెలల వరకు ఉంటుంది.
సూర్యగ్రహణ దోష నివారణకు దానం, హోమం,జపం,దేవతార్చన,అభిషేకం, శక్తి కలిగిన వాళ్ళు బంగారంతో చేసిన నాగప్రతిమను, శక్తి లేనివారు శిలరూపంలో చెక్కిన నాగ ప్రతిమను గాని, పిండితో చేసిన నాగప్రతిమను గాని బ్రాహ్మణునికి, లేదా దేవాలయం నందు సూర్యబింబంతో(కాపర్,వెండి,బంగారం,స్పటికం) సహా దానం చేసిన మంచిది.
ఎవరి జన్మ రాశి, జన్మ నక్షత్రంలో గ్రహణం సంభవిస్తుందో ఔషదములతో కూడిన స్నానమాచరించిన గ్రహణ దోషం తొలగిపోవును. మణిశిల, యాలకులు, దేవదారు, కుంకుమపువ్వు, వట్టివేళ్ళు, గోరోచనం, కస్తూరి, కుంకుమ, ఎర్ర పుష్పాలు, ఎర్రగన్నేరు, రక్త చందనం, చెరువు మట్టి లేదా, పుట్ట మట్టి, గోశాల మట్టి గాని తెప్పించుకొని గ్రహణమునకు ముందే కలశ కుంభములందు ఉంచి దేవతలను ఆవాహనం చేసుకొని “ఓం సూర్యాయనమః” అంటూ స్నానమాచరించాలి. శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. హోమం చేయశక్తి లేనివారు నాల్గింతలు జపం చేయాలి.
సూర్యగ్రహణానికి ముందు 12 గంటలు వేదకాలము. ఈ వేదకాలం నందు భోజనం చేయరాదు. చిన్నపిల్లలు, వృద్ధులు కనీసం మూడు లేదా ఆరు ముహూర్త కాలమందు వేదకాలంగా పాటించి భోజనం చేయరాదు. అలా కాకుండా భోజనం చేసిన నరకమును, శయనించితే రోగం, మూత్రం చేసిన దారిద్ర్యం కలుగును. తైలాభ్యంగన స్నానం చేసిన కుష్ఠు రోగం వచ్చును.
గ్రహణసమయములో ఉపవాసము ,తినే పదార్దాలు ఫై దర్భలు వేయడం చూస్తూ ఉంటాము. ఈతరం వాళ్ళకు అది వింతగాను, మూర్ఖంగాను కనిపించవచ్చు. ఆలాగే గ్రహణానికి కొన్ని గంటలముందు నుంచే ఉపవాసం ఉండడం విడ్డూరంగా ఉంటుంది . విక్రం సారాభాయ్ పరిశోధన కేంద్రం వారి పరిశోధనలో గ్రహణ సమయంలో సూర్యకాంతి పడిన నీరు కలుషితం అవుతుందని దీనిని నివారించటంలో దర్భలు శ్రేష్టమైన ఓషధ గుణాలు కలిగి ఉన్నాయని సైంటిఫిక్ గా పరిశోధనలు చేసి ఋజువులతో తెలియజేశారు. దీని ప్రకారం తినే పదార్ధాలఫై వేసిన ధర్బలు తులసి దళముల కంటే ఎక్కువుగా చెడును కలిగించే కిరణములను నిరోదిస్తుంది అని చెప్పవచ్చు.
సూర్య గ్రహణసమయంలో సూర్యకిరణములలోని మార్పులు అనూహ్యoగా ఉండడంతో జీర్ణవ్యవస్థతో దీని ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. అందుకనే జంతువులు కూడా ఆ సమయంలో ఆహారం ముట్టవని జైపూర్ జంతు ప్రదర్శనశాల వారి పరిశోధనలో బయటపడింది .ప్రకృతిపరంగా ఏర్పడిన ఈ మార్పుకు జంతువులు సైతం నియమాలు పాటిస్తున్నప్పుడు తెలివైన మానవుడు ప్రకృతికి బిన్నoగా ప్రవర్తించకూడదు. ఆ సమయములో ఏర్పడే కిరణాల ప్రభావం వల్ల శరీరంలోని మార్పులుకు అనుగుణంగా ఆ సమయంలో భోజనాలు చేయకుండ ఉంటే మంచిది అని పెద్దలు చెపుతుంటారు.ఆ క్షణంలో మార్పు కనిపించదు కాని దాని ప్రభావం తప్పకుండ ఉంటుంది.
గ్రహణ సమయంలో దేవాలయాలన్నీ మూసేస్తారు అసలు దేవాలయాల్ని ఎందుకు మూస్తారు అంటే ఆగమ శాస్త్రానుసారం గ్రహణ సమయంలో దేవాలయాల్ని మూసి, తర్వాత ప్రోక్షణ చేసి పూజలు ప్రారంభించాలి. అందుకే దేవాలయాలు మూసివేస్తారు.
గ్రహణం సమయంలో చేసే మానసిక జపం మామూలుగా చేసే దానికన్నా అనేక రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుందంటారు. గ్రహణ సమయంలో ఆవు నెయ్యతో దీపారాధన చేసి, దాని ముందు కూర్చుని జపం చేస్తే, ఆ మంత్రంతో హోమం చేసినంత ఫలితాన్నిస్తుంది. అయితే అందరూ ఈ జపాలు చేయలేరు. శారీరకంగా అశక్తులు వుండవచ్చు, ఉద్యోగరీత్యా, ఇంకా ఇతర పనులవల్ల కుదరకపోవచ్చు. అలాంటివారు శాస్త్ర ప్రకారం సూర్య గ్రహణానికి 12 గం. ముందునుంచీ కడుపు ఖాళీగా వుండాలి. ఈ సమయంలో ఏమైనా తినటంవల్ల అనారోగ్యం కలుగవచ్చు.
గ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదు. కంటిలో వుండే సున్నితమయిన పొరలు దెబ్బతిని అంధత్వం వస్తుందని, ఎలాంటి ఉపకరణాలూ లేకుండా నేరుగా కంటితో గ్రహణాన్ని చూడటం వల్ల కంట్లో ఏర్పడే దోషాలను ఏ చికిత్సతోనైనా బాగు చేయటం చాలా కష్టమని ప్రసిధ్ధ కంటి వైద్య నిపుణులు అంటున్నారు.
గర్భం ధరించిన స్త్రీలు గ్రహణం రోజున బయట తిరిగితే అరిష్టమని భారతీయ స్త్రీలు ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే కడుపుతో ఉన్నవారిని ఇంట్లోనే ఉంచుతారు. గ్రహణం ఉన్నంతసేపు వీరిని బయటికి రానివ్వరు. నిద్రపోనివ్వరు, ఇంట్లోనే మెల్లిగా నడవమని చెబుతుంటారు. గర్భం ధరించిన స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటికే పరిమితమవ్వడం మంచిదని, అంతేగాక తమ నివాస గృహాలలో ఆ సమయంలో సూర్యుడి ఛాయలు పడకుండా జాగ్రత్తపడాలని , గ్రహణ సమయంలో ప్రసరించే అతినీలలోహిత కిరణాలు గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. సూర్య కాంతికి కూర్చోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూరగాయలు తరగడం.. ఇత్యాది వంట పనులు చేయకూడదు. గర్భస్ధ శిశువుల మీద గ్రహణ సమయంలో కిరణాల ప్రభావం చాలా వుంటుందని డా. అపర్ణా సక్శేనా గర్భస్ధ ఎలుకలమీద చేసిన ప్రయోగాలతో కనుగొన్నారు. ఆ కిరణాలలో వుండో రేడియో ధార్మిక శక్తి వలన ఆ ఎలుకలకి పుట్టిన పిల్లలలో ఎముకలు, మజ్జలో లోపాలు, అవయవాలు సరిగ్గా తయారు కాకపోవటం వగైరా లోపాలు కనుగొన్నారు. అందుకే గర్భిణీలు గ్రహణ సమయంలో బయట తిరగకూడదన్నారు.
మన పూర్వీకులు ఏ సైన్స్ ఏ పరిశోధనలు లేని కాలంలో ఎంతో విజ్ఞానంతో, ఎంతో దూరం ఆలోచించి, ఎన్నో తరాలదాకా ప్రజలకి మేలు చేసే విషయాలను తెలియజెప్పారు. వాటిని పాటించి శుభాల కోసం ప్రయత్నం చేద్దాం.

గోపూజ- గోవిశిష్టత

శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి, సేవించి గోపాలకుడైనాడు. ‘ఆహార శుద్ధౌ సత్వశుద్ధిః’ అని శాస్త్ర వచనం. సరైన ఆహారాన్ని తీసుకుంటే వ్యక్తిలో శాంతగుణం పెరుగుతుందనీ శ్లోకార్థం. అందుకే మన మహర్షులు గోవుల్ని పెంచి ఆ క్షీరాన్ని స్వీకరించి సత్వగుణ సంపన్నులైనారు.
ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలనీ ఆరాధించినట్లేనని మన పురాణాలు చెబుతున్నాయి. గోవును, ‘గోమాత’ అని పిలుస్తారు. కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారు కాబట్టి భారతీయులకు పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవనసరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని వహించింది. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తున్నాయి.
పూర్వం బ్రహ్మ అచేతనాలైన నదులు, పర్వతాలు మున్నగు వాటిని సృష్టించి, జీవాత్మతో కూడిన చేతనమగు వస్తు జాతమును అగ్ని నుంచి ఉత్పన్నం కావాలని సంకల్పించుకొని, అగ్నియందు ఉత్పత్తికి సాధకమగు హోమాన్ని చేశాడు. శరీరం కొరకు వాయువు, చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు. వారి హోమం వలన గోవు ఒక్కటే ఉత్పన్నమైంది. గోవుకు వేదప్రమాణమైన ప్రాముఖ్యత ఉంది. అగ్ని సంబంధమగు హోమంవలన గోవు జన్మించుటచేత గోవునకు అగ్ని హోత్రమని పేరు వచ్చింది. మన వేదాలలో ‘గో’ మహాత్మ్యాన్ని ఉపదేశించి వివరించే మంత్రాలనేకం ఉన్నాయి. గోమాతకు సకల సంపదలకు పుట్టిల్లుగా అధర్వణ వేదం కీర్తించగా, ఋగ్వేదం ‘గవా తుల్యం నోపశ్యామినృణే త్వామ్’ అని పలుకగా, నిరుపమానమైన ఔన్నత్యం ఆవుకి ఉన్నదని యజుర్వేదం ప్రశంసించింది. ఆవులో దేవతా శక్తులున్నాయని, అతీంద్రియ దర్శనశక్తి కలిగిన మన మహర్షులు దర్శించి చెప్పారు. అందుకే గోవులున్నచోట కుండలినీ శక్తి అధికంగా ఉంటుంది. గోవును సేవించడం వలన, గ్రహ దోషాలు తొలగిపోతాయని, గోవుకి ఆహారం సమర్పించడం ద్వారా పితృదేవతలకి పిండప్రదానం చేయలేని వారికి పిండప్రదానం చేసిన ఫలితం లభిస్తుందని మన పురాణాలు పేర్కొన్నాయి.
ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ‘‘నాథా! జనులు పాపము నుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గమును, తరుణోపాయమును తెలుపమ’’ని అడగగా - శివుడు పార్వతీదేవితో ‘‘గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు. పాదములందు పితృ దేవతలు, కాళ్ళయందు సమస్త పర్వతాలు, దంతములందు గణపతి, ముక్కున శివుడు, ముఖమున జేష్ఠాదేవి, కళ్ళయందు - సూర్యచంద్రాదులు, చెవులయందు శంఖచక్రాలు, కంఠమున విష్ణుమూర్తి, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, వెన్నునందు వరుణ దేవుడు, అగ్నిదేవుడు, తోకలో చంద్రుడు, చర్మమున ప్రజాపతి, రోమావళి యందు త్రిశంకకోటి దేవతలు నివసించెదరు. అందువల్ల గోమాతను పూజించి ఆయురారోగ్యములను, అష్టైశ్వర్యములను పొందవచ్చునని, గోవులకు ఆహారం పెడితే సమస్త దేవతలకు ఆహారం పెట్టినంత పుణ్యఫలం కలుగుతుందని, గోమాతను నమస్కరించి ప్రదిక్షణం చేస్తే భూమండలమంతా ప్రదిక్షణం చేసినంత ఫలము కలుగుతుందని’ చెప్పాడు. భారతీయ గోజాతి అన్ని దేశాల ఆవులకన్నా సౌరశక్తిని అధికంగా గ్రహిస్తుందని, ఆవునేతిని నిప్పుమీద వేస్తే వచ్చే ధూమం పర్యావరణాన్ని కాలుష్య రహితం చేస్తుందని యజ్ఞయాగాదులవల్ల తెలుస్తోంది. అటామిక్ రేడియేషన్ నుండి రక్షణ పొందగల శక్తి ఆవు పాలల్లో ఉందని రష్యన్లు తెలిసికొన్నారు. మన ప్రాచీన భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక గోమాత. హిందూ మతంలో గోరక్షణ అత్యంత ప్రధానమైనది. అన్నివిధాలా ఆవు మనకు మేలే చేస్తోంది. బ్రతికీ, మరణించీ కూడా ఉపకారమే చేస్తోంది. కనుక గోవులను సంరక్షించుకుందాం!
గోవుకు ఆహారాన్ని ఇచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠి౦చడ౦ శుభకర౦.
“ప౦చభూతశివే! పుణ్యే! పవిత్రే! సూర్య స౦భవే!
ప్రతీచ్ఛేమ౦ మయాదత్త౦ సౌరభేయి! నమోస్తుతే!!:
ప౦చ భూతాలకు శుభాన్ని కలిగి౦చే పుణ్యస్వరూపిణీ! పవిత్రురాలా! సూర్యుని ను౦డి కలిగినదానా! (సౌరశక్తిలోని దివ్యత్వ౦ గోవులో ఉన్నదని భావ౦). నేనిస్తున్న ఈ ద్రవ్యాన్ని స్వీకరి౦చు. సురభీ వ౦శ౦లో కలిగిన తల్లీ! నీకు నమస్కారము.
గోమాత దర్శనము చేయునప్పుడు చదివే శ్లోకాలు:–
నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయాభ్య ఏవచ l
నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః ll
భావం:-శ్రీమంతంబులై కామధేను సంతతులైన బ్రహ్మాదులచే స్తుతించబడిన పవిత్రములైన గోవులకు నా నమస్కారము….
గావో మమాగ్రతః నను గావో మే సంతు పృష్టతః l
గావో మే హృదయం నిత్యం గవాం మధ్యే వసామ్యాహం ll
భావం:–గోవులు నాముందు-వెనుకలందు యుండుగాక. గోవులే నా హృదయము. గోవుల మధ్యయందు నేను నివసించుచున్నాను…..
సర్వ దేవమయే దేవి సర్వ దేవైరలం కృతే l
మమాభిలషితంకర్మ సఫలం కురు నందిని ll
భావం:–ఓ గోమాతా ! సర్వదేవతాస్వరూపిణి, సర్వదేవతలచే అలంకరింపబడినదానా ! నా కోర్కెలను సఫలం చేయుము….
గో మహిమ గురించి శివపార్వతుల సంభాషణ
ఓకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాథా ! స్త్రీలు తెలిసి తెలియక ముట్లు, అంటు కలిపిన దోషం, పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధముగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్ఠింపగా దయామయుడగు పరమశివుడు ” ఓ పార్వతీ! గోవునందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వపాపములు నశించును. ఆ గోవునందు పాదములు ఋణ పితృ దేవతలు, గొలుసులు, తులసి దళములు, కాళ్ళ లో సమస్త పర్వతాలు, మారుతీ కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదములు, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్య చంద్రులు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ, ఇంద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉండును. ఉదరమున పృధ్వీ దేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు. ఉదరమున సనక, సనంద, సనత్ కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్య కిరణములను, తోలు ప్రజాపతి, రోమావళి త్రిశంత్కోటి దేవతలు పిరుదుల యందు పితరులు, కర్రి కావేరిబోలు, పాదుగు పుండరీకాక్షుని బోలు, స్తనాలు,సప్త సముద్రాలు, పాలు సరస్వతి నది, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదులు తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు. గోపాద ధూళి సమస్త పుణ్య నదులు, తీర్థములు కన్నా గొప్పది. కావున ఓ పార్వతీ ! ఈ గోమాహాత్మ్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మ హత్యా మహా పాతకములన్నియు తొలగును. ప్రతి అమావాస్యనాడు పఠిస్తే మూడు నెలల మహాపాపములు తొలగును. నిత్యము సంధ్య వేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, సెనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితము నిచ్చును. గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం. గోవును పూజించితే సమస్త దేవుళ్ళను పూజించి నట్లగును. గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయవలెను. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్క రోజు చేసినచో పుణ్యం లభిస్తుంది” అని బోధించాడు.
ఆవు మజ్జిగ
పెరుగుకు నాలుగురెట్లు నీళ్లు కలిపి చిలికి వెన్న తొలగిస్తే మజ్జిగ తయారవుతుంది. మజ్జిగలో కొవ్వును తొలగిస్తారు కనుక పెద్ద వయసువారికి మంచి చేస్తుంది.
మజ్జిగ మూడు దోషాలనూ తగ్గిస్తుంది. మజ్జిగను సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే వాతాన్ని తగ్గిస్తుంది. మజ్జిగను పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది. మజ్జిగకు శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది. ఆవు మజ్జిగ మూడు దోషాలను తగ్గిస్తుంది. పథ్యంగా, ఆకలిని పెంచేదిగా, రుచికారకంగా, బుద్ధివర్థకంగా పనిచేస్తుంది. గేదె మజ్జిగ కఫాన్ని పెంచుతుంది. అలాగే వాపును పెంచుతుంది.
**మజ్జిగను వాడకూడని సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు జలోదరం (ఎసైటిస్), యకృద్‌వృద్ధి (హెపటోమెగాలి), ఉబ్బసం, దగ్గు, బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధుల్లో మజ్జిగను వాడటం మంచిది కాదు.
* మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది.
* పైల్స్ వ్యాధిలో మజ్జిగ బాగా పనిచేస్తుంది. మజ్జిగ పోసిన చోట గడ్డి మొలవదు. అలాగే మజ్జిగను ఎక్కువగా వాడేవారిలో పైల్స్ కూడా తయారుకావు.
* దురదతో కూడిన అర్శమొలలకు వెన్నతో కూడిన మజ్జిగ తీసుకోవాలి. మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి తీసుకుంటే మల విసర్జన తరువాత మల ద్వారంలో వచ్చే మంట తగ్గుతుంది.
* రక్తస్రావంతో కూడిన అర్శమొలకు వెన్న తొలగించిన మజ్జిగ తీసుకోవాలి. లేదా మజ్జిగలో ఉప్పు, వాముపొడి కలిపి తీసుకోవాలి. అలాగే మరో మంచి చికిత్స ఉంది. చిత్రమూలం వేరు బెరడును ముద్దగా దంచాలి. ఈ పేస్టును కుండలోపల పూసి, దానిలో మజ్జిగ చేసుకొని తాగాలి.
* పిప్పళ్లను వర్ధమాన యోగం రూపంలో మజ్జిగతో వాడాలి. అంటే పిప్పళ్లను పది రోజుల వరకూ రోజుకొకటి చొప్పున పెంచి తిరిగి తగ్గించుకుంటూ రావాలి.
* మూత్రంలో మంటకు మజ్జిగలో శుద్ధిచేసిన గంధకాన్ని కలిపి తీసుకోవాలి.
* చర్మంపైన మంటలకు మజ్జిగలో వాష్ క్లాత్‌ని ముంచి ఒళ్లు తుడుచుకోవాలి.
* సొరియాసిస్, ఎగ్జిమాకు చిక్కని మజ్జిగలో ఒక నూలు గుడ్డను తడిపి కొన్ని గంటలపాటు చర్మవ్యాధి ఉన్నచోట పరిచి ఉంచితే ఉపశమనం లభిస్తుంది.
* వేరుశనగ, నెయ్యి వంటి ఆహారాలతో ఎలర్జీలకు మజ్జిగకు కాస్తంత పసుపుచేర్చి తీసుకోవాలి.
* ఒంటికణత నొప్పికి అన్నంలో మజ్జిగ పోసుకొని కొంచెం బెల్లం కలిపి తినాలి. దీనిని సూర్యోదయానికి ముందే తీసుకోవాలి.
* విరేచనాలు: మజ్జిగలో వేయించిన జీలకర్ర పొడిని కలిపి తీసుకోవాలి. లేదా మజ్జిగలో తేనె కలిపి తీసుకోవాలి.
* మల ద్వారం చుట్టూ దురదకు మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకోవాలి. దీనివల్ల మలంలోని ఆమ్లత్వం తగ్గి దురద తగ్గుతుంది.
* నులిపురుగులకు మజ్జిగలో వాయువిడంగాల చూర్ణం కలిపి తీసుకోవాలి.
* మాంసాహారం అరుగుదలకు మజ్జిగలో మాంసపు ముక్కలను నానేసి ఉడికించాలి. మజ్జిగలో ఊరటంవల్ల మాంసంలోని తంతువులు మార్ధవంగా తయారవుతాయి.
* పొడి చర్మం: మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి రాసుకొని సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం నునుపుగా తయారవుతుంది.
*మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని పానీయంగా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు.
ఆవుపాల పెరుగు
ఆవుపాల పెరుగు ఆకలి కలిగిస్తుంది. జీర్ణశక్తిని పెంచి శక్తినిస్తుంది. పెరుగు లేదా దధి ఒక మంచి ఆహార పదార్ధము. మరిగించిన పాల లో గోరువెచ్చగా ఉండగా మజ్జిగచుక్కలను వేస్తే పాలు గట్టిగా తోడుకొంటాయి. దీనినే పెరుగు అంటారు. పెరుగు నుండి వెన్న,నెయ్యి లను తీస్తారు. పాలలో తోడు తక్కువ వేస్తే పెరుగు తియ్యగా ఉంటుంది. తోడు ఎక్కువైతే పెరుగు పుల్లగా ఉంటుంది. పెరుగు ఎలాంటి వాత వ్యాధినయినా జయిస్తుంది. ఇది బరువును పెంచుతుంది, శరీరానికి పుష్టిని కలిగిస్తుంది. ఆహారం మీద యిష్టం లేని వాళ్ళకి పెరుగు మంచిదని ఆయుర్వేదం చెబుతుంది.
మనం తెలుగులో దీనిని "పెరుగు" అంటాం. ఆంగ్లంలో "యోగర్ట్" అనీ హిందీలో "దహీ" అని అంటారు. ఏదైనా ఫెర్మెంటో పాలనే పెరుగు అనడం అర్థవంతంగా లేకపొయినా, పాలని పులవబెట్టడం వలన పెరుగవుతోందనేది అందరికీ తెలిసిందే. ఆరోగ్యాన్నివ్వటంలో పెరుగుని మించిన పదార్థం మరొకటి లేదు. ఆహార పదార్థాలలో దీనిని అమృతంగా పోలుస్తారు. విదేశాల్లో అయితే ఆవు పాలతోనే పెరుగు తయారుచేస్తారు. మన దేశంలో మాత్రం గేదె పాలతోనూ పెరుగు తయారుచెయ్యటం పరిపాటి.
పెరుగులో పోషకపదార్థాలు:
పోషక పదార్థం
విలువలు
నీటిశాతం 89.1%
ప్రోటీన్ 3.1%
క్రొవ్వులు 4%
మినరల్స్ 0.8%
కార్బొహైడ్రేట్స్ 3%
కాల్షియం 149 మి.గ్రా
ఫాస్పరస్ 93 మి.గ్రా
ఇనుము 0.2 మి.గ్రా
విటమిన్ - ఎ 102 ఐ.యు
విటమిన్ - సి 1 మి.గ్రా
* జలుబుగా ఉన్నపుడు పెరుగు బాగా పనిచేస్తుంది.
* మూత్ర సంబంధమైన రోగాల్లో కూడా పెరుగు ఉత్తమం.
* జిగురు విరేచనాలయ్యేవారికి పెరుగు బాగా పని చేస్తుంది.
* మీగడ తీసిన పెరుగు, పాలపై వెన్న తీసి తయారుచేసిన పెరుగు అత్యుత్తమమైన ఫలితాలనిస్తాయి.
* పెరుగులో పెసరపప్పు, శొంఠి, పంచదార , ఉసిరి కాయ పొడి చేర్చి తింటే అధికమైన ఉపయోగాలు పొందవచ్చునని ఆయుర్వేదం చెబుతుంది.
*అన్ని రకాల జ్వరాల్లో కూడా పెరుగును నిరభ్యంతరంగా వాడుకోవాలని ఆయుర్వేద సూచన.
* పెరుగులో తియ్యనిది, పుల్లనిది, బాగా పుల్లనిది అని మూడు రకాలు ఉంటాయని సుశృతుడు వివరించాడు. అలాగే పెరుగు వాడటం వలన శరీరానికి చాలా ఉపయోగం అని చరకుడు కూడా తెలిపాడు.
* పెరుగులో ఉండే పోషక విలువలు పాలలో ఉండే పోషక విలువలతో సమానంగా ఉన్నప్పటికీ, పెరుగులో ఉండే ప్రత్యేక గుణం దాన్ని ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలలో ఉన్నత స్థానంలో ఉంచుతుంది. పాలు పెరుగుగా మారడానికి జరిగే ప్రక్రియలో బాక్టీరియా పాలలో ఉండే ప్రోటీన్ ని తేలికగా అరిగేలా చేస్తుంది. ఈ రకమైన మార్పు వలన పెరుగు త్వరగా జీర్ణం అవుతుంది.
* జీర్ణకోశంలో పెరిగే హానికర బాక్టీరియాలని పెరగనివ్వకుండా చేస్తుంది. అంతే కాకుండా మనకి "మంచి" చేసే బాక్టీరియాని పెరిగేలా కూడా చేస్తుంది. ఈ బాక్టీరియా పెరుగులో ఉండే మినరల్స్ త్వరగా రక్తంలో కలిసేలా చెయ్యడం , బి కాంప్లెక్స్ విటమిన్ ని తయారుచేయటం లాంటి పనులు కూడా చేస్తుంది.
* చర్మం నిగనిగలాడుతూ కనిపించేలా కూడా పెరుగు ఉపయోగపడుతుంది.
* ఎండ వేడికి చర్మం పాడవకుండా చేస్తుంది. చర్మానికి సరఫరా అయ్యే నరాలకి శక్తినిస్తుంది. పెరుగులో ఉండే బాక్టీరియా చర్మ పోషణకు ఉపయోగపడుతుంది.
* పెరుగులో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి పై పూతగా పూస్తే చర్మం పై ఉండే మలినాలు త్వరగా కరిగిపోతాయి. చర్మంపై తేమ శాతం పెరుగుతుంది. కాంతివంతంగా తయారవుతుంది.
* ముఖంపై మొటిమలున్నవారికి పెరుగులో కొంచెం శనగ పిండి కలిపి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గిపోతాయి.
* పెరుగు తలకి రాస్తే మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. తలస్నానానికి ముందుగా పెరుగుని తలకి మర్థించి తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.
* చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
** అలాగే ఆయుర్వేదం పెరుగును గురించి చెబుతూ రాత్రి వేళల్లో పెరుగు వేసుకోకూడదంటుంది. అలాగే పెరుగుని వేడి చేసి తినకూడదు.పూర్తిగా తోడుకోని పెరుగును కూడా తినవద్దని ఆయుర్వేదంలో ఉంది. వేసవికాలం పెరుగును ఎక్కువ తీసుకోరాదు. అలాగే ప్రతిరోజూ తినకూడదు.
దేశీయ గోక్షీరం ఆరోగ్య ప్రదాయిని
1. కొంచెం, పలుచగా ఉండి త్వరగా అరుగుతుంది.
2. చిన్నపిల్లలకు తల్లిపాలతో సమానం.
3. మనిషికి చలాకీని పెంచుతుంది.
4. ఉదర సంబంధమైన జబ్బులు తగ్గుతుంది. ప్రేగులలోని క్రిములు నశించును.
5. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
6. చదువుకునే పిల్లలకు, మనస్సుతో పనిచేసే వ్యక్తులకు తెలివిని పెంచి వారిని నిష్ణా తులను చేస్తాయి.
7. మనస్సును, బుద్ధిని చైత న్యవంతం చేస్తాయి. సాత్విక గుణమును పెంచుతుంది.
8 ఆవుపాలలో మనకు మిక్కిలి మేలుచేసే బంగారు తత్వముతో కూడిన విట మిను 'ఎ' అధికంగా కలిగిన 'కెసీన్‌' అనే ఎంజైమ్‌ ఉన్నది. దీనివలన ఈ పాలు పసుపు పచ్చగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని బాగా పెంచు తుంది.
9. తెల్ల ఆవుపాలు వాతాన్ని, నల్ల (కపిల) ఆవు పాలు పిత్తాన్ని, ఎరుపురంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి.
10. ఆవుపాలు సర్వరోగ నివారణి.
11. ఆవుపాలు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి.
12. ఘృతేన వర్ధతే బుద్దిః క్షీరేణాయుష్య వర్ధనం- ఆవునెయ్యి బుద్ధిబలాన్ని ఆయుష్షును పెంచుతుంది.
13. ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉంది.
14. మనం భుజించిన తేజో (అగ్ని) సంబంధమైన ఆవు నెయ్యి, నూనె, వెన్న, వగైరా లలోని స్థూల భాగం మజ్జ (మూలగ) గా మారుతుంది. సూక్ష్మభాగం వాక్కు అవు తుంది. ఆరోగ్యమైన ఎము కలు, మజ్జ (మూలుగ), మంచి సాత్వికం, శ్రావ్యం అయిన వాక్కు వీటి కోసం ఆవు నెయ్యి, వెన్న తప్పక తిఐ్వ.
15. ఆవునెయ్యి రక్తంలో మంచిదైన హెచ్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ను పెంచి చెడుదైన ఎల్‌డిఎల్‌ కొలెస్టిరాల్‌ను తగ్గించును. హెచ్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ గుండె జబ్బులు, అధిక రక్తపోటు రాకుండా కాపాడుతుంది.
16. భారతీయ గోవునకు మూపురం ఉంటుంది. ఈ మూపురం క్రింద ఉన్న వెన్నుపూసలో సూర్యశక్తిని గ్రహించగల దివ్యమైన ప్రాణశక్తితో కూడిన 'స్వర్ణనాడి' (సూర్యకేతు నాడి) అనే సూక్ష్మనాడీ ప్రవాహ శక్తి కేంద్రం ఉన్నది. సూర్య కిరణములు ఆవు మూపురముపై పడినపుడు ఈ స్వర్ణనాడి ఉత్తేజితమై సూర్య శక్తిని గ్రహించి బంగారు తత్వముతో కూడిన పసుపు పచ్చని 'కెసీన్‌' అనే ఎంజైమ్‌ను తయారు చేసి దానిని ఆవుపాలలో పెడుతుంది. అందువలన ఆవుపాలు, నెయ్యి, వెన్న పసుపుపచ్చని పసిమి రంగుతో ఉంటాయి. పాశ్చాత్య గోవులైన జర్సీ, హెచ్‌.ఎఫ్‌ వంటి గోవులకు మూపురం ఉండదు. అవి సూర్యశక్తిని గ్రహించలేవు. ఇవి శీతల ప్రదేశంలో చలికి తట్టుకొనే విధంగా పరిణామం చెందినవి. వీటికి మన దేశీయ ఆవుల వలె సూర్యశక్తిని గ్రహించగల స్వర్ణనాడి ఉండదు. అందు వలన వీటి పాలు మంచివి కావు. ఇవి కేవలం అధిక పాల ఉత్పత్తికై యాంత్రిక జీవులుగా మనం భావించ వచ్చును.
భారతదేశ ఉజ్జ్వల భవిష్యత్తు మూపురం ఉన్న ఆవు పై ఆధారపడి ఉన్నది. ఈ ఆవుపాలు చలాకితనాన్ని, తెలివిని, జ్ఞాపకశక్తిని, సత్వ గుణమును, బుద్ధిబలమును, ఓజస్సును పెంచును. ఓజస్సు మనిషి తెలివికి, ఆకర్షణ శక్తి కి వ్యాధి నిరోధక శక్తికి ప్రధాన కారణం.
ఆవునెయ్యి ఆరోగ్యకరమైన మంచి ఎముకలను, మంచి రక్తాన్ని ఉత్పత్తి చేయు మూలుగును, మంచి వాక్కును, మేధాశక్తిని, కాంతిని, బుద్ధిబలాన్ని పెంచును. విద్యార్థులకు జ్ఞాపకశక్తిని పెంచును. రక్తంలో చెడు కొలెస్టరాల్‌ అయిన LDL Cholesterol పెరగనివ్వదు. ఆవు నెయ్యి వలన ఉత్పత్తి అయిన మూలుగ నుండి మంచి రక్తం మంచి మూల కణ ములు (Stem cells) ఉత్ప త్తి అయి వ్రతిశరీర అవయ వమును శక్తివంతంగా ఉంచి వ్యాధి కారక క్రిములను Aidsను కలుగచేయు Virus క్రిములతో సహా) చంపివేసి, ఆరోగ్యమును కలుగచేయును. స్త్రీలలో ఎము కలు బలహీనమై Osteoporosis Arthritis అనే వ్యాధి రాకుండా ఉండు టకు, వచ్చిన వ్యాధిని తగ్గించుటకు, గర్భిణీ స్త్రీలు కాల్షియం పొందుటకు-కాల్షియం మాత్రల కన్నా ఆవునెయ్యి ఎంతో శ్రేష్ఠమైనది. స్త్రీ గర్భంలోని బిడ్డకు ఎముకల పుష్టికి, మేధాశక్తికి పునాది వేస్తుంది. ఈ జన్మలో నిత్యం తీసుకొనే ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి సూక్ష్మ అంశతో ఏర్పడే 'మనస్సు బుద్ధి' రాబోవు జన్మలో వారికి మంచి మేధాశక్తి, బుద్ధిబలాన్ని ప్రసాదిస్తుంది.
ఆవు వెన్న (నవనీతము)
షడ్రుచులు అంటే ఆరు రుచులు. అవి తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు రుచులు. ఈ రుచులతో కూడినపదార్ధములు తినిననచో మన శరీరములో షడ్రసములు ఉత్పత్తి అవుతాయి. యివి 1) మధురరసం (తీపి), 2) ఆమ్లరసం (పులుపు), 3)లవణరసం (ఉప్పు), 4) కటురసం (కారం), 5) తిక్తరసం (చేదు), 6) కషాయరసం (వగరు). ఈ షడ్రసములు సమపాళ్ళలో వున్నట్లయితేమన ఆరోగ్యం బాగు ఉంటుంది. ఎక్కువ తక్కువ లయినట్లయితే దానికి సంబంధించిన అనారోగ్యము వస్తుంది. ఉదా|| మధురరసంపెరిగినచో చక్కెరవ్యాధి, ప్రకృతిలో ప్రతి ఆహారపదార్ధములో ఏదో ఒక చుచి ఉంటుంది. కానీ నవనీతంలో ఒక విశుద్ధ గుణమున్నది. షడ్రచులలో ఏ రుచికి చెందని మాధుర్యమైన సాత్వికమైన మధురరసం (ఇది మామూలు తీపి రుచి కాదు) నవనీతములో ఉన్నదవి.
నవనీతము విశుద్ధ వర్ణము కలది, సత్వగుణము కలది, శాంత రసము కలది, కనిపించే సూర్య కాంతికి, స్పటికమునకు నీటికి రంగులేదు.అలాగే రుచి చూసే వస్తువులలో వెన్నకు రుచిలేదు. వెన్నలో వున్న శాంతరసమందు మనస్సు, సత్వగుణమును శాంతిని, తన్మయత్వమును,ససమాధిని పొందుతుంది. అందుకే శ్రీకృష్ణు మనకు తెలియచేయుటకు నవనీతమును నోటినిండ తినేవాడు. నవనీత చోరుడు ఆయన.యిటువంటి నవనీతమును మనకు ప్రసాదించుచున్న గోవునకు జయమగు గాక.
సాధారణంగా ప్రతి ఇంట్లోనూ వెన్న, నెయ్యి తరచూ వాడుతుంటారు. మేధాశక్తిని, చురుకుదనాన్ని పెంచే శక్తిగల వెన్న వలన అనేక ప్రయోజనాలు, మరెన్నో సద్గుణాలు ఉన్నాయి.* మజ్జిగను చిలికి తీసిన వెన్న మధురంగా ఉండటమేగాక శరీరంలో ధాతువులను సమస్థితికి తీసుకువచ్చి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంటే మెటబాలిజం అనే జీవన ప్రక్రియను శరీరం సక్రమంగా నిర్వర్తించుకునేలా చేస్తుంది. సులభంగా జీర్ణమవుతుంది. జఠర రసాన్ని పెంచి, జీర్ణకోశాన్ని క్రమబద్ధీకరిస్తుంది. పొడి దగ్గును అరికడుతుంది. వెన్న కొంచెం ఆలస్యంగా అరుగుతుంది. కానీ, బలవర్థకమయినది. కాలేయాన్ని బలంగా ఉంచుతుంది. చర్మరోగాలను దరిచేరనీయదు. పిల్లల చేత వెన్న తినిపిస్తే మేధాశక్తి పెరుగుతుంది.
* తాజా వెన్నలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఎ, బి, సి, డి విటమిన్లు ఉన్నందున ఎదిగే పిల్లలకు వెన్న చక్కని పౌష్టికాహారం. వెన్నలో లభించే కొవ్వు పదార్థం సులభంగా జీర్ణమై, బలాన్ని వృద్ధిపరుస్తుంది. ప్రతిరోజూ పెరుగును చిలికి వెన్న తీసి పిల్లలకు పెడితే మేధావంతులుగా, ఆరోగ్యంగా పెరుగుతారు. వెన్నను శరీరానికి మర్దనా చేసినట్లయితే చర్మానికి వర్ఛస్సును, మృదుత్వాన్ని ప్రసాదిస్తుంది. నీరసించే పిల్లలకు, బలహీనులకు, గుండె బలం తక్కువగా ఉన్నవారికి వెన్న అత్యుత్తమమయినది.
* ఆవు వెన్నకు, గేదె వెన్నకు చాలా తేడా ఉంటుంది. శరీరానికి అవసరమైన చమురు గుణాన్ని కలుగజేసి, చలువను, దృఢత్వాన్ని కలిగించడంలో ఆవు వెన్న అత్యుత్తమమయినది. గేదెవెన్న కంటే ఆవు వెన్న సులభంగా జీర్ణమవుతుంది. వాతము, పిత్తమును క్రమబద్ధీకరించి, రక్తదోషము, క్షయ, మూలవ్యాధులను నివారించడంలో ఆవు నెయ్యి విశిష్టమైనది. అంతేగాక, ఈ రెండు రకాల వెన్న బలాన్ని, వీర్యవృద్ధిని, వర్ఛస్సును కలుగజేస్తాయి.
* వెన్నలో పంచదార కలిపి తీసుకుంటే కడుపులో మంట, పోట్లు సమసిపోతాయి. తేనె, చెరకురసం, ఉప్పు వెన్నకు విరుగుడు.
ఘృతం
ఆవునెయ్యిని ఘృతం అంటారు, మేధాశక్తిని పెంపొందించడంలో నెయ్యే అగ్ర తాంబూలం. ఆయుర్వేదం ప్రకారం నెయ్యితో కూడిన ఆహారపదార్థాలను (జీడిపప్పు వంటివి) తీసుకోవడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంపొందించుతాయి. ఇలా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా అవుతుంది. అయితే నెయ్యిని పరిమితంగానే వాడాల్సి వుంటుంది. ఇందులో "విటమిన్ A" వుంటుంది.
ఆవునెయ్యి ఆరోగ్యానికి ఉపయోగకరమనీ, వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుందనీ ప్రయోగపూర్వకంగా నిరూపితమైంది. దీపారాధన చెయ్యటానికీ, యజ్ఞయాగాలకూ ఆవునెయ్యిని వినియోగిస్తారు. ఆవునెయ్యితో వెలిగించిన దీపం వున్న గదిలో వున్నవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
యజ్ఞయాగాదులలో ఆహుతి చేసిన ఆవునెయ్యి నుంచి వచ్చిన ఆవిరి ఆకాశంలో 7, 8 కి.మీ. ఎత్తుకి వెళ్ళి వర్షాలు పడతాయని రష్యా శాస్త్రవేత్తలు పరిశోధన చేసి కనిపెట్టారు. మనవాళ్ళు కృత్రిమ వర్షాలు కురిపించటానికి మేఘమధనానికి వాడే కెమికల్స్ వల్ల కురిసే వర్షాలలో నీరుకూడా కాలుష్యమయమై వుంటుంది.
పురాణాలలో కధ ప్రకారంకూడా గాంధారి గర్భప

navagraha pariharam

రవిగ్రహ దోషం ఉన్నవారు గోదుమపిండి,గోధుమరొట్టె,ఆరెంజ్ వస్త్రాలు,రాగి,రాగి జావ,మిరియాలు వస్తువులు దానం చేయవచ్చును.

చంద్రగ్రహ దోషం ఉన్నవారు అన్నదానం,బియ్యం,పాలు,నీళ్ళు,కెలుపు కాటన్ వస్త్రాలు,వెండి వస్తువులు,పొంగళి మొదలగునవి దానం చేయవచ్చును.

కుజగ్రహ దోషం ఉన్నవారు కందిపప్పు,మిరపకాయలు,పచ్చి ఖర్జూర,డేట్స్ సిరప్,బెల్ల,ఎరుపు వస్త్రాలు,వ్యవసాయ పనిముట్లు,శుక్రుడితో కలిసిన సోదరికి వస్త్రాభరణాలు బహుమతిగా ఇవ్వటం.,ఎరుపు రంగు వస్త్రాలు మొదలగునవి దానం చేయటం.

బుధగ్రహ దోషం ఉన్నవారు పెసరపప్పు,ఆకుకూరలు,కూరగాయలు,ఆకుపచ్చ వస్త్రాలు,విద్యార్ధులకు విద్యా సంబంధమైన వస్తువులు ,పుస్తకాలు ఆవుకి పచ్చగడ్డి వెయ్యటం మొదలగునవి దానం చేయవచ్చును.

గురువుగ్రహ దోషం ఉన్నవారు పండ్లు,తీపి పదార్ధాలు,శెనగ గుగ్గిళ్ళు,ధార్మిక కార్యక్రమాల కోసం దానం,విద్యా,వైద్యం,భోజనం,పసుపు రంగు వస్త్రాలు ,తియ్యని పానియాలు, బఠాని గుగ్గిళ్ళు,దానం చేయవచ్చును.

శుక్రగ్రహ దోషం ఉన్నవారు స్త్రీలకు సంబందించిన బొట్టు బిళ్ళలు,జడ పిన్నులు,జడ రబ్బర్లు, గోరింటాకు,గోళ్ళ రంగులు,సెంటు,అద్దాలు,దువ్వెనలు,పౌడర్లు,పూలు,డ్రైప్రూట్స్, బొబ్బర్లు, అలచందలు,రంగు రంగుల వస్త్రాలు,మొదలగునవి దాన చేయవచ్చును.

శనిగ్రహ దోషం ఉన్నవారు వంట నూనె,నువ్వులు,ఇనుము,దేవాలయాలకు సిమెంట్,నీలిరంగు వస్త్రాలు ,కార్మికులకు,పనిచేసేవారికి వస్తు,ధన రూపంలో దానం చేయవచ్చును.

రాహుగ్రహ దోషం ఉన్నవారు మినప సున్నిండలు,ఇడ్లీలు,మినపగారెలు,తడిపి నాబెట్టిన మినుములు ఆవుకి పెట్టటం,పొగరంగు వస్త్రాలు దానం చేయవచ్చును.

కేతుగ్రహ దోషం ఉన్నవారు పశువులకు,పక్షులకు,చేపలకు ఆహారం పెట్టటం,ఉలవల పొడిని ఆవులకి పెట్టటం,విచిత్ర వర్ణ వస్తువులు దానం చేయవచ్చును.

శ్రీ పుత్ర గణపతి స్తోత్రం

శ్రీ పుత్ర గణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి)
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు
‘‘సాక్షాత్‌ రుద్ర ఇవాపరః’’ అన్నట్లుగా జగదంబ అనుగ్రహముతో జన్మించి రుద్రానుగ్రహముతో సకల విఘ్నములకు అధిపతి అయిన గణపతిని శివుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖము పెట్టినప్పుడు జగదంబ పార్వతీ దేవిని ఆనందింప డేయుటకు పరమేశ్వరుడితో సహా దేవతలందరూ పార్వతీ ఒడిలో ఉన్న వినాయకుని స్తుతించిన స్తుతిని విన్న అమ్మ వారు ఎవరైతే ఈస్తుతిని గౌరీ సమేత గణపతిని ఫాల్గుణ శు।।చవితి యందు పఠించి నువ్వలుబెల్లము నివేదన చేసి ప్రసాదముగా స్వీకరిస్తారో అట్టి భక్తులందరికీ నాకేవిధముగా అయితే పుత్రశోకము తొలగి పుత్రవృద్ధి కలిగినదో అదేవిధముగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి వంశవృద్ధి జరుగునని జగదంబ పార్వతి వరమిచ్చెను. అట్టి జగదంబ సమేత పుత్రగణపతి అనుగ్రహముపొందుటకు ఈ పుత్రగణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి) పారాయణము చేయడం వలన వంశదోషములు తొలగి శక్తియుక్తలు కలిగిన పుత్రులు జన్మించునని వరాహపురాణ వచనము. మొదట ఈస్తోత్రముతో డుంఢి రాజు అను కాశీరాజు పుత్రగణపతిని ఆరాధించి సత్ఫలితములను పొందెను. అత్యంత అధ్భుతమైన ఈ స్తోత్రమును ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలితం.
శ్లో।। ఙ్ఞానశక్తిముమాం దృష్ట్వా
యద్‌ దృష్టం వ్యోమ్ని శంభునా ।
యచ్చోక్తం బ్రహ్మణా పూర్వం
శరీరంతు శరీరిణామ్‌ ।। 1
శ్లో।। యచ్చాపి హసితం తేన
దేవేన పరమేష్ఠినా ।
ఏతత్కార్య చతుష్కేణ
పృథివ్యాంచ చతుర్ప్యపి ।। 2
శ్లో।। ప్రదీప్తాస్యో మహాదీప్తః
కుమారో భాసయన్‌ దిశః ।
పరమేష్ఠి గుణైర్యుక్తః సాక్షాత్‌
రుద్ర ఇవాపరః ।। 3
శ్లో।। ఉత్పన్నమాత్రో దేవానాం
యోషితః సప్రమోహయన్‌ ।
కాన్త్యా దీప్త్యా తథా మూర్త్యా
రూపేణచ మహాత్మవాన్‌ ।। 4
శ్లో।। తద్‌ దృష్ట్వా పరమం రూపం
కుమారస్య మహాత్మనః ।
ఉమానిమీషే నేత్రాభ్యాం
తమ పశ్యతభామినీ ।। 5
శ్రీ పరమేశ్వర ఉవాచ -
శ్లో।। వినాయకో విఘ్నకరో గజాస్యో
గణేశ నామా చ భవస్య పుత్రః ।
ఏతేచ సర్వే తవయాన్తు భృత్యా
వినాయకాః క్రూరదృశః ప్రచండాః ।
ఉచ్చుష్మ దానాది వివృద్ధ దేహః
కార్యేషు సిద్ధం ప్రతిపాదయన్తః ।। 6
శ్లో।। భవాంశ్చ దేవేషు తథా ముఖేషు
కార్యేషుచాన్యేషు మహానుభావాత్‌ ।
అగ్రేషు పూజాం లభతేన్యధాచ
వినాశయిష్య స్యథ కార్యసిద్ధిం ।। 7
శ్లో।। ఇత్యేవ ముక్త్వా పరమేశ్వరేణ సురైః
సమం కాంచన కుంభ సంస్థెః ।
జలై స్తథా సావభిషిక్తగాత్రో
రరాజ రాజేంద్ర వినాయకానాం ।। 8
శ్లో।। దృష్ట్వాబిషిచ్య మానంతు
దేవాస్తం గణనాయకం ।
తుష్టువుః ప్రయతాః సర్వే
త్రిశూలాస్త్రస్య సన్నిధౌ ।। 9
దేవా ఈచుః - 9
శ్లో।। నమస్తే గజవక్త్రాయ
నమస్తే గణనాయక ।
వినాయక నమస్తేస్తు నమస్తే
చండ విక్రమ ।। 10
శ్లో।। నమోస్తుతే విఘ్నకర్త్రే
నమస్తే సర్పమేఖహో ।
నమస్తే రుద్ర వక్రోత్థ ప్రలంబ జఠరాశ్రిత ।
సర్వదేవ నమస్కారాదవిఘ్నం-
- కురు సర్వదా ।। 11
శ్రీ పార్వత్యువాచ -
శ్లో।। అపుత్రోపి లభేత్‌ పుత్రా
నధనోపి ధనం లభేత్‌ ।
యం యమిచ్ఛేత్‌ మనసా
తం తం లభతి మానవః ।। 12
శ్లో।। ఏవంస్తుత స్తదా
దేవైర్మహాత్మా గణనాయకః ।
అభిషిక్తస్య రుద్రస్య
సోమస్యా పత్యతాం గతః ।। 13
శ్లో।। ఏతస్యాం యస్తిలాన్‌ భుక్త్వా
భక్త్యా గణపతిం నృప ।
ఆరాధయతి తస్యాశు తుష్యతే
నాస్తి సంశయః ।। 14
శ్లో।। యశ్చైతత్‌ పఠతే స్తోత్రం
యశ్చైతచ్ఛ్రుణుయాత్‌ సదా ।
నతస్య విఘ్న జాయన్తే
నపాపం సర్వథా నృప ।। 15
సేకరణ ః కంచిపీఠ ఆస్థాన సిద్ధాంతి, ఆంధప్రదేశ్‌ ప్రభుత్వ ఆగమ సలహాదారులు
జ్యోతిష కేసరి, జ్యోతిష చతురానన, దైవజ్ఞశిరోరత్న బిరుదాంకితులు
బ్రహ్మశ్రీ. దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాన్తి
పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు. వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు . మంచి సంతానం కోసం, సంతానం లేని వల్లూ సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారు అని పురాణాలూ చెబుతున్నాయి.
చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వాళ్ళ సంతానం కలుగుతుంది అని నమ్మకం.
పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం ఫాల్గుణ శుద్ధ చవితి ప్రత్యేకతగ కనిపిస్తూ వుంటుంది. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ రోజున ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటారు. పుత్ర సంతానం కావాలనుకునే వాళ్లు ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 'పుత్రగణపతి వ్రతం' ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
వారసుడు కావాలనే కోరిక ... తమ తరువాత ఆడపిల్లల బాగోగులు చూసుకోవడానికిగాను ఒక మగ సంతానం కావాలనే ఆశ కొంతమందిలో బలంగా కనిపిస్తూ వుంటుంది. ఈ విషయంగా ఎక్కువకాలం నిరీక్షించవలసి వచ్చినప్పుడు, పుత్ర గణపతి వ్రతం జరుపుతుంటారు. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి ... గడపకి పసుపురాసి కుంకుమ దిద్ది .. గుమ్మానికి తోరణాలుకట్టి .. పూజామందిరాన్ని అలంకరించాలి.
ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను ... పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకితభావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది.
పూర్వం మహారాజులు ... చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్లంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తరువాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్లు భావించేవాళ్లు. ఇక పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్లు పుత్ర సంతానం కోసం ఆరాటపడే వాళ్లు. ఇందుకోసం వాళ్లు 'ఫాల్గుణ శుద్ధ చవితి' రోజున 'పుత్ర గణపతి' వ్రతాన్ని ఆచరించే వాళ్లు.
అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు ప్రస్తావిస్తున్నాయి.
ఇక రాజులు తమ ప్రాభవాన్ని కోల్పోయినా ... రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయినా 'పుత్రగణపతి వ్రతం' మాత్రం నాటి నుంచి నేటి వరకూ ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి, పరిశుభ్రమైన పట్టువస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో కలశస్థాపన చేసి ... శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుత్రగణపతి వ్రత కథను చదువుకుని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి.
ఇంచుమించు వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. తమకి పుత్ర సంతానం కావాలని పూజా సమయంలోనే స్వామివారికి దంపతులు అంకితభావంతో చెప్పుకోవాలి. బుద్ధిమంతుడు ... జ్ఞానవంతుడు ... ఆదర్శవంతుడైన పుత్రుడిని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి. ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వలన అనతికాలంలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతారు.
ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి. ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ ఉండాలి. మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకితభావంతో గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనతికాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

ఫాల్గుణం విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం

ఫాల్గుణం
ఫాల్గుణం విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధిస్తుందని భాగవత పురాణం చెబుతోంది. ఆదితి పయోవ్రతం ఆచరించి వామనుని పొందింది. ఫాల్గుణంలో గోదానం, ధనదానం, వస్త్రదానం, గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం.
చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణ మాసం. ఇంతకు ముందున్న పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు, వ్రతాలు ఈ చివరి మాసంలో మళ్ళీ ఓసారి కనిపించటం విశేషం. సర్వదేవతా వ్రత సమాహారంగా, సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది. మనపెద్దలు సంవత్సరం పొడవునా ఉన్న అన్ని మాసాల్లోనూ ఆయా మాసాల్లో ఒక్కో దేవతనో, వ్రతాన్నో ప్రధానంగా సూచించారు. బహుశా అప్పుడా పూజలు, వ్రతాలు మరో అవకాశాన్ని కల్పిస్తుందా అన్నట్టు ఈ మాసం ఉంటుంది. ఇది దాటితే మళ్ళీ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.
ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న మాసం అంటుంటారు. ఈ నెలతో శిశిర రుతువు ముగుస్తుంది. వసంతానికి స్వాగత సన్నాహాలు, సర్వజన ఆహ్లాదకర వాతావరణానికి తెర తొలిగే రోజులు వచ్చేస్తాయి. ఎందరెందరో మహనీయుల జయంతులు వస్తుంటాయి. పాతంతా అంతరించి కొత్త కాంతులు మెల్లమెల్లగా విచ్చుకుంటుంటాయి. నీలకంఠ, బోధాయన తదితర మహర్షుల జయంతులతోపాటు శ్రీకృష్ణతత్వాన్ని విశ్వవ్యాప్తం చేసిన చైతన్య ప్రభువు ఈ మాసంలోనే జన్మించారు.
ఫాల్గుణ శుద్ధ పాడ్యమినాడు భద్ర చతుష్టయం, విదియనాడు మధూకం లాంటి వ్రతాలను సంప్రదాయాన్ని పాటించేవారు చేస్తుంటారు. ఫాల్గుణ శుద్ధ చవితినాడు అవిఘ్న గణపతి వ్రతం, పుత్ర గణపతి వ్రతం చేస్తారు. డుంఢిరాజ వ్రతం జరుపుతుంటారు. పంచమినాడు అనంత పంచమీవ్రతం, సప్తమినాడు అర్కసంపుట సప్తమీ లాంటి వ్రతాలు, అష్టమినాడు దుర్గాష్టమిగా కూడా పేరున్న లలిత కాంతీ దేవీ వ్రతం చేస్తారు. నవమినాడు ఆనంద నవమీ వ్రతం, ఏకాదశినాడు ఆమలక (ఉసిరి) ఏకాదశి, ద్వాదశినాడు గోవింద ద్వాదశి, చతుర్ధశి రోజు మహేశ్వర వ్రతం, లలితకాంతి వ్రతం, జరుపుతుంటారు. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమను మహాఫాల్గుణి అని అంటూ పవిత్ర దినంగా భావిస్తారు.
దేశమంతటా అందరికీ పరిచయమైన హోలీ పండుగ ఈ రోజునే ఉంటుంది. ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షంలో ఉత్తమ వ్రతాలు అనేకం వస్తుంటాయి. కృష్ణపాడ్యమినాడు వసంత ఆరంభోత్సవం లాంటి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. విదియనాడు కామ మహోత్సవం, చవితినాడు వ్యాసరాజ ఆరాధన, పంచమినాడు సీతామాత పూజ, ఏకాదశినాడు కృష్ణ ఏకాదశి, ద్వాదశినాడు నృసింహ ద్వాదశి లాంటి వ్రతాలను నిర్వహిస్తుంటారు. ఫాల్గుణ శుక్ల చతుర్ధశినాడు పిశాచ శాంతి కోసం పిశాచ చతుర్ధశి జరుపుతారు. ఈ మాసంలో చివరి తిథి అయిన అమావాస్యనాడు గ్రామ దేవతలకు ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ మాసంలో మార్చి 14న సూర్యుడు మీనరాశిలో ప్రవేశించేరోజు మీన సంక్రమణం. దీన్ని షడశీతి సంక్రాంతి అంటారు. ఈ రోజున చేసే జపదానాలు విశేష ఫలప్రదమని విశ్వాసం.కొన్ని ప్రాంతాల్లో ఏరువాకను కర్షకులు ఇలా ఫాల్గుణ మాసంలో ఆది నుంచి తుది దాకా ఉన్న తిథుల్లో సర్వ దేవతలకు సంబంధించిన పూజలు, వ్రతాలు ఉన్నట్లు కనిపిస్తుంది.
దసరాల్లో జరిగే దుర్గాష్టమి, కార్తీకంలో కనిపించే ఉసిరి, శివ, లక్ష్మీనారాయణుల పూజలన్నింటినీ పరిశీలిస్తే సంవత్సరంలో గడిచిన పదకొండు మాసాల్లో కారణాంతరాల వల్ల ఎవరైనా ఏ వ్రతాన్నైనా, పూజనైనా జరుపుకోవటానికి వీలుపడకపోతే అయ్యో ఆ వ్రతం చేసుకోలేకపోయామే, ఆ పూజను జరుపుకోలేక పోయామే అని బాధపడనవసరం లేకుండా అలాంటి వ్రతాన్నే ఫాల్గుణ మాసంలో జరుపుకోవటానికి భక్తిపరంగా, ఆత్మసంతృప్తిని పొందటానికి వీలున్నట్లు కనిపిస్తుంది. మాస విశిష్టత గురించి మత్స్య పురాణం కూడా వివరిస్తోంది. ఫాల్గుణ మాసంలో గృహ నిర్మాణం చేస్తే సువర్ణ, పుత్ర లాభాలు చేకూరుతాయంటోంది ఈ పురాణం. ఫాల్గుణ మాసం ఎంతో విశిష్టమైందని పలు పురాణాలు, వ్రత గ్రంథాలు వివరిస్తున్నాయి
హోలీ (సంస్కృతం: होली )అనేది రంగుల పండుగ ,హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగనుభారత దేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్ మరియు ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారత దేశంలోని పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్‌లలోదీన్ని దోల్‌యాత్రా (దోల్ జాత్రా ) లేదా బసంత-ఉత్సబ్ ("వసంతోత్సవ పండుగ") అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికిసంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్ మరియు బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజులు పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి.
దుల్‌‌‌హేతి , ధులండి మరియు ధులెండి అని కూడా పిలిచే ముఖ్యమైన రోజు హోలీ ఉత్సవ రోజున, ప్రజలు రంగుల పొడిని మరియు రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు. ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలిక దహన్ (హోలికను కాల్చడం) లేదా చోటీ హోలీ (చిన్న హోలీ) అని అంటారు. హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకుపరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు.ఆంధ్ర ప్రదేశ్లో హోలిక దహన్‌ను కామ దహనం అని అంటారు.
ఇది సాధారణంగా శీతాకాలం చివర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలల తదుపరి వారాల్లో వచ్చే చివరిఫాల్గుణమాసము (ఫిబ్రవరి/మార్చి) (ఫాల్గుణ పూర్ణిమ),పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కొన్ని రోజుల తరువాత, ఫాల్గుణ బహుళ పంచమి (పౌర్ణమికి ఐదవ రోజు)న పండుగ ముగింపున సూచిస్తూ రంగులతో రంగ పంచమి ఉత్సవాన్ని జరుపుకుంటారు.

దైవ పూజలో తామ్ర పాత్ర (రాగి పాత్ర)లను ఎక్కువగా వాడుతుంటారు. దీనికి కారణం ఏమిటి?

రాగి పాత్రల విశిష్టత
దైవ పూజలో తామ్ర పాత్ర (రాగి పాత్ర)లను ఎక్కువగా వాడుతుంటారు. దీనికి కారణం ఏమిటి? అసలీ ప్రశ్నను భూదేవే వరాహ రూపుడైన నారాయణుడిని తొలిగా అడిగింది. అప్పుడు రాగి అంటే తనకెందుకు ఇష్టమో ఇలా వివరించాడు ఆ నారాయణుడు.
రాగి పవిత్ర వస్తువులన్నిటిలోకీ పవిత్రమైంది. అది సంసారం నుంచి ముక్తిని కలిగిస్తుంది. దీక్ష తీసుకొన్న వారు, విశుద్ధులు అయిన వారు నారాయణుడికి సంబంధించి అన్ని కార్యాలలోనూ రాగినే ఉపయోగించాలి.
పూర్వం ఏడువేల యుగాల కిందట గుడాకేశుడు అనే ఓ మహా రాక్షసుడు రాగి రూపాన్ని ధరించి విష్ణువును ఆరాధిస్తూ ఉండేవాడు. కావటానికి మహా రాక్షసుడే కానీ గొప్ప భక్తుడతడు. పదహారు వేల ఏళ్ళ పాటు గుడాకేశుడు తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి అతడున్న తామ్రాశ్రమం అనే ఆశ్రమానికి శ్రీ మహావిష్ణువు వచ్చాడు. తపస్సుకు మెచ్చినట్లు చెప్పి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడా రాక్షసుడు ఎంతో ధర్మబుద్ధితో, భక్తి ప్రపత్తులతో దేవదేవుడికి నమస్కరించి స్తుతి చేశాడు. తనకు వేరే భోగభాగ్యాలేవీ అక్కరలేదని, సుదర్శన చక్రంతో తన శరీరాన్ని ఛేదించి తన ప్రాణాలను విష్ణువులో కలుపుకోమన్నాడు. ఆ తర్వాత తన శరీరం విష్ణు పూజలో ఉపకరించాలని, దానితో చేసిన పాత్రలు నారాయణ పూజలో వాడే పవిత్ర వస్తువులు కావాలని కోరాడు ఆ రాక్షసుడు. శ్రీ మహావిష్ణువు ఆ భక్తుడి కోర్కెను అనుగ్రహిస్తూ వైశాఖ శుక్ల పక్ష ద్వాదశినాడు మధ్యాహ్న సమయంలో తన సుదర్శన చక్రం ఆ రాక్షసుడి శరీరాన్ని ఛేదిస్తుందని చెప్పి అంతర్ధానమయ్యాడు.
గుడాకేశుడు నారాయణుడు చెప్పిన ఆ శుభ ఘడియ కోసం ఎదురు చూస్తూ నిరంతరం విష్ణు పదసేవలో నిమగ్నమవుతూ వచ్చాడు. ఆ క్షణం రానే వచ్చింది. భక్తుడు కోరిన కోర్కెను తీర్చింది. మహారాక్షసుడి ప్రాణాలు నారాయణుడిలో లీనమయ్యాయి. అతడి శరీర మాంసం అంతా రాగి అయింది. రక్తం తగరం గానూ, ఎముకలు బంగారంగానూ, మలినం కంచుగానూ అయింది.
తనలో లీనమవ్వాలని నిస్వార్థ భక్తితో భక్తుడు కోరిన కోర్కెను తీర్చేందుకే విష్ణువు రాగిని అంత పవిత్రమైనదిగా అనుగ్రహించాడు. రాగి పాత్రలో నివేదించిన ఒక్క మెతుకును స్వీకరించినా ఎన్నెన్నో జన్మల పాపం నశించి పుణ్యం ప్రాపిస్తుంది. అది శుద్ధాలలో శుద్ధం, మంగళాలలో మంగళం.
ఇక్కడ ఓ విషయం గమనించాల్సి ఉంటుంది. నిజంగా రాగి అనే లోహం అలాగే పుట్టిందా? మహారాక్షసుడైన వాడిని భగవంతుడు అనుగ్రహించమేమిటి? అనే తీరులో ఆలోచించకుండా హేతుబద్ధంగా ఆలోచించినా ఇక్కడ ఓ చక్కటి సందేశమే కనిపిస్తుంది. భగవంతుడైన నారాయణుడి దృష్టిలో సకల ప్రాణులూ సమానమే. గుడాకేశుడు వాస్తవానికి మహా రాక్షసుడే. అయితేనేమి రాక్షస సహజమైన దుర్మార్గాలకతడు పాల్పడకుండా కేవలం దైవభక్తితోనే జీవితాన్ని సాగించాడు. ఇతర రాక్షసులలాగా తీవ్రంగా తపస్సు చేసి దేవతలకు ఇబ్బంది కలిగించే వరాలనేవీ కోరుకోలేదు. తను మరణించినా, తన శరీరం కూడా దైవసేవకే ఉపకరించాలన్నాడు. తన ప్రాణాలు దైవంలోనే లీనమవ్వాలన్నాడు. ఇలాంటి భక్తితత్వాన్నే ఏ కాలంలోని భక్తులైనా కోరుకోవాలని సూచించటం ఇక్కడ కనిపించే సందేశం. ఈ కథంతా వరాహ పురాణం నూట ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది.