Tuesday, 29 March 2016

ఈశాన్య స్థలమున నివసించే వారికి ధనము పెరిగేకొద్ది?

వాస్తు ప్రకారం ఈశాన్య స్థలమందు నివసించే వారు మంచి ఆలోచనలు కలిగివుంటారు.  ఉద్రేక స్వభావులు. ఇతరులతో వాక్చాతుర్యత, అందంతో ఆకర్షింపబడుతారు. గృహాలు, వీరు నివసించే పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటారు. అందరితో కలిసిమెలసి ఉంటారు. పనులను చురుగ్గా ముగిస్తారు. చలాకీగా ఉంటారు. 
 
అయితే వీరికి ధనము పెరిగేకొద్ది పిసినారి తనము అధికమగును. తాము చేయు కృషి ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంది. తమ బాధ్యతల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. సమయానుకూలంగా ప్రవర్తిస్తారు. దానధర్మముల యందు ఆసక్తి తక్కువ. మానసిక కష్టములున్నప్పటికీ ధైర్యంగా ఎదుర్కొంటారు.
 
ధనాన్ని ఖర్చు చేయడంలో వెనుకడుగు వేస్తారు. డబ్బును పొదుపు చేయడంలో సమర్థులు. వీరి జీవితంలో కష్ట-సుఖాలు సమానంగా ఉంటాయి. స్వయంకృషితో పైకిరాగలరు. స్థిరచరాస్తులు సంపాదించగలరు. 

వాస్తు సలహాలు.. ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశ గా అడుగులు వేయ్యాలా !!!!!!!

వాస్తు ప్రకారం ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశను చూడటం వలన కుబేరస్థానాన్ని చూసినట్లవుతుంది. దీనివల్ల ధనాదాయం ఎప్పుడూ బాగుంటుంది. పక్కమీద నుండి దిగగానే తూర్పువైపుకు కొంచెం నడక సాగించడం మంచిది. దీనివలన తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. మంచి లాభాలు పొందుతారు. 
 
లెట్రిన్‌లో-దక్షిణాభిముఖంగా గానీ ఉత్తరాభి ముఖంగా గానీ కూర్చోవాలి. తూర్పు, పడమరలకు అభిముఖంగా కూర్చోకూడదు. గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యంలో ప్రారంభమై నైరుతివైపుకు చెత్తను ప్రోగు చేయాలి. ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదు. 
 
ఆగ్నేయమూల వంట చేసేటప్పుడు తూర్పు అభిముఖంగా నించుని వంట చేయాలి. ఇంటిని చిమ్మే చీపురు శనికి ఆయుధం. కాబట్టి గోడకు ఆనించేటప్పుడు చీపురు హేండిల్ పైకి మాత్రమే పెట్టి ఉంచడం శుభకరం. ఈశాన్యములో దేవుని మందిరాలు నిర్మించి పూజ చేయకూడదు. దీనివల ఈశాన్యం మూత పడటం జరుగుతుంది. తూర్పు గోడలోనే దేవుని గూడును ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం

వాస్తు ప్రకారం ఎఏ వైపు కుర్చుని బుజిస్తే ఏ ఏ ఫలితాలు కల్గుతాయి

మనిషి శక్తికి ముఖ్యమైనది ఆహారం. ఆ ఆహారంలో ఎన్నో రకాలున్నాయి. వివిధ రకాలుగా వివిధ రుచులతో ఇష్టమైన రీతిలో ఆహారాన్ని తయారు చేసుకుని కడుపారా ఆరగిస్తుంటాం. ఆ వంటకాలు ఎంతో శుభ్రంగానూ, రుచిగా.. ఆరోగ్యకరంగా కూడా ఉండాలని భావిస్తాం. 
 
అయితే ఈ ఆహారాన్ని ఏ వైపు కూర్చుని తినాలన్న విషయాన్ని ఆలోచించామా? పూర్వకాలంలో అయితే పీటలు వేసుకుని కూర్చుని భుజించేవాళ్లు. కానీ ఈ ఆధునిక కాలంలో డైనింగ్ టేబుళ్లు అవీ అంటూ ఏ దిశలో కూర్చుంటున్నామో కూడా తెలియడంలేదు. టేబుల్‌ను కూడా సరైన దిశలో అమర్చుకుని తింటే మనకు శుభాలు జరుగుతాయి.
 
తూర్పు ముఖం పెట్టి భుజించడం ద్వారా ఆయుష్షు పెరుగుతుంది. పడమర వైపు కూర్చుని భుజిస్తే ఇంట్లోని సామాను వృద్ధి చెందుతుందట. దక్షిణం వైపు కూర్చుని భుజిస్తే పేరు ప్రతిష్టలు వృద్ధి చెందుతాయట. అంతేకాదు, ఏ కార్యము తలపెట్టినా విజయాలే కలుగుతాయట.
 
ఉత్తరం దిక్కు చూస్తూ కూర్చుని భుజించరాదు. ఆ వైపు ముఖం పెట్టి భుజిస్తే సర్వ అరిష్టాలతో పాటు అనారోగ్యాలు వెన్నంటే ఉంటాయట. టేబుల్‌పైన అయినా సరే, పీట వేసుకుని భుజించే సమయంలోనైనా సరే ఈ దిశలలో కూర్చోవడం ద్వారా సకల శుభాలూ కలుగుతాయి.

 

వాయువ్య దిశ ఎత్తుగా ఉండి పందిళ్ళు వేసుకుంటే?

గృహమందుగానీ, ఖాలీ స్థలమందుగానీ వాయువ్యము మెరక కల్గియున్నట్లైతే వంశవృద్ధి, ఐశ్వర్యముస సకల సుఖాలు కలుగుతాయి.

వాయువ్య దిశ పల్లముగా ఉన్నట్లైతే శత్రువృద్ధి, అజీర్ణ వ్యాధులు స్త్రీలకు అరిష్టములు ప్రాప్తింగలవు. 
 
వాయువ్య దిశ ఎత్తుగా ఉండి అందు పాకలు, పందిళ్ళు, పశుశాలలు ఉంటే ధన ధాన్యాభివృద్ధి, పశు సంపద పెరుగుట వంటి శుభఫలితాలుంటాయి. అలాగే వాయువ్య దిశలో బావులు ఉండకూడదు.
 
ఇలా వుంటే అనేక ఇక్కట్లు తప్పవు. వాయువ్య దిశలో నీళ్ళ కుండీలు, వాటర్ టాంకులు ఉంటే కుటుంబంలో కలహాలు తప్పవు 

North disayandu nutulu , gotulunnatlaite ..?(ఉత్తర దిశయందు నూతులు, గోతులున్నట్లైతే..?)

ఉత్తర దిశలో గృహమందుగానీ, ఖాళీ స్థలమందు గానీ ఉత్తర దిశ మెరక కలిగివున్నట్లైతే గౌరవభంగము, ఐశ్వర్యనాశనము, సంతానారిష్టము కలుగగలవు. 
 
ఉత్తరదిశ తగినంత పల్లము కలిగియున్న అట్టి గృహమందు నివసించువారికి సర్వజనపూజ్యత, పుత్రపౌత్రాభివృద్ధి, యశము, ధనధాన్యసంపదలు సర్వత్ర శుభములు కలుగగలవు. మెరకకలిగిన ఉత్తరమందు పాకలు మొదలగు కట్టడము కలిగి యుండుట వలన క్రమక్రమముగా ధననష్టము, వంశనాశనము కలుగును.
 
ఉత్తర దిశయందు నూతులు, గోతులు, వర్షపు నీరు పోవు కాల్వలు మొదలగునవి యున్నట్లైతే ధనలాభము, సంతతికి అభివృద్ధి కలుగగలదు.