Wednesday, 17 February 2016

వాస్తుశాస్త్ర సంబంధ గ్రంధాలు,ప్రధాన వస్తువులు,వాస్తు పురుష మండలాలు

వాస్తుశాస్త్ర సంబంధ గ్రంధాలు

  • మనసార శిల్ప శాస్త్రము (రచన : మనసారా),
  • మాయామతం (రచన : మాయా),
  • విశ్వకర్మ వాస్తుశాస్త్రము (రచన : విశ్వకర్మ),
  • అర్ధ శాస్త్రం
  • సమారంగణ సూత్రధార (రచన : రాజా భోజ),
  • అపరాజిత పృచ్చ (విశ్వకర్మ అతని కుమారుడు అపరాజిత మధ్య సంవాదము, రచన భువనదేవాచార్య)
  • మానుషాలయ చంద్రిక
  • శిల్పరత్నం
  • పురాణాలలో-మత్స్య, అగ్ని, విష్ణు ధర్మొత్తరం, భవిష్య పురాణాలలో వాస్తు ప్రకరణలు ఉన్నాయి.
  • సంహితా గ్రంధాలు ;బృహత్సహిత,గార్గసంహత,కాశ్యప సంహిత
  • ఆగమ గ్రంధాలు:శైవాగమాలు,వైష్ణవాగమాలు

ప్రధాన వస్తువులు

వాస్తు శాస్త్రంలోని నిర్మాణ వ్యవస్థలో ప్రధాన వస్తువులు పంచ భూతాలైన
  • భూమి
  • జలం
  • అగ్ని
  • వాయు
  • ఆకాశం

వాస్తు పురుష మండలాలు

ఎనిమిది దిక్కులకు పరిపాలించే అష్టదిక్పాలకులు ప్రధాన మండలాధిపతులు:

వాస్తు శాస్త్ర పురాణం





వాస్తు శాస్త్ర పురాణం

పూర్వ కాలంలో అంధకాసురడనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పతిప్పలు పెట్టుచుండెను. అప్పుడు లోక సమ్రక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలిన ఒక చమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళవదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమ క్రమంగా భూమి, ఆకాశాలను ఆవరించసాగింది. ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు. బ్రహ్మదేవుని శరణువేడారు. సమస్త భూతములను సంభవించువాడు, సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ దేవతలను ఊరడించి 'ఆ భూతమును అధోముఖంగా భూమి యందు పడవేసే విధానం చెప్పాడు. బ్రహ్మ దేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముకంగా క్రిందకు పడవేశారు.
ఆ భూతం భూమిపై ఈశాన్య కోణమున శిరస్సు, నైరుతి కోణమున పాదములు, వాయువ్య, ఆగ్నేయ కోనాలందు బాహువుల వుండునట్లు అధోముకంగా భూమిపై పండింది. అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై ఈ విధంగా కూర్చున్నారు.
శిరస్సున - శిఖి(ఈశ) దక్షిణ నేత్రమున - సర్జన్య వామనేత్రమున - దితి దక్షిణ శోత్రమున - జయంతి వామ శోత్రమున - జయంతి ఉరస్సున (వక్షమున) - ఇంద్ర, అపవత్స, అప, సర్ప దక్షిణ స్తనమున - అర్యమా వామ స్తనమున - పృధ్వీధర దక్షిణ భుజమున - ఆదిత్య వామ భుజమున - సోమ దక్షిణ బాహువున - సత్య, భృశ, ఆకాశ, అగ్ని, పూషా
వామ బాహువున - పాప యక్ష, రోగ, నాగ, ముఖ్య, భల్లాట దక్షిణ పార్శ్వకామున - వితధి, గృహక్షత వామ పార్శ్వకామున - అసుర, శేష ఉదరమున - వినస్వాన్, మిత్ర దక్షిణ ఊరువున - యమ వామ ఊరువున - వరుణ గుహ్యమున - ఇంద్ర జయ దక్షిణ జంఘమున - గంధర్వ వామ జంఘమున - పుష్పదంత దక్షిణ జానువున - భృంగరాజ వామ జానువున - సుగ్రీవ దక్షిణ స్పిచి - మృగబు వామ స్పిచి - దౌవారిక పాదములయందు - పితృగణము
ఇంతమంది దేవతల తేజస్సముదాయంతో దేదీప్య మానంగా వెలుగొందుతున్న ఆ భూతకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దాన్నే 'వాస్తు పురుషుడూ గా సృష్టిగావించాడు.

వాస్తు శాస్త్రం




వాస్తు శాస్త్రం : వాస్తు అంటే నివాసగృహం/ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది / రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. భారతీయులు, చైనీయులు తమ ఇంటి నిర్మాణాల్లో పాటిస్తారు. వాస్తు శాస్త్రంలో ప్రధానం గా నాలుగు భాగాలు ఉన్నాయి.
  1. భూమి వాస్తు.
  2. హర్మ్య వాస్తు
  3. శయనాసన వాస్తు.
  4. యాన వాస్తు.

వాస్తు శాస్త్రము

    వాస్తు శాస్త్రము
ప్రపంచములో ప్రతి మనుష్యునకు తన ప్రప్తానుసారము గృహము లబ్యమగును.గనుక మానవుల స్తూల సూక్ష్మ తమాది బెదములచే ఖర్మ యొక్క సుభాసుభములు తార తమ్యమును అనుసరించి వివిదములగు వృద్ది క్షయములు ,ఐశ్వర్య ,దారిద్ర్యములు ,కష్ట సుఖములు ,ఇవి అని అననేలా ?సర్వమును గృహము వలన ప్రతి మానవునకు కలుగు చున్నది .ఇందుచే మానవుని పూర్వ ఖర్మకును ,గృహమునకును అవినాభావ సంబందమున్నది నియు ,గృహము వలన మానవుని ఖర్మ యొక్క సుభాశుభములు ,గుణ దోషములు ప్రకాశ మగుననియు,అట్టి గృహములు ప్రతి మనుష్యునకు సుభా శుభములను కలుగ జేయును .వృద్ది క్షయములకు ముఖ్యాదార భూతమై యున్నది అనుట నిర్వివాదాంసము.అట్టి గృహమును నిర్మించుటకు వలయు విది నిషేదములను ,గుణ దోషములను నిరుపించునది వాస్తు శాస్త్రము .ఇందును గురించి పూజ్య పాదులగుమన మహర్షి వర్యులనేకులనేక గ్రంధములను వ్రాసి మహొ ప్రక్రుతి నొనర్చి యున్నారు .అవన్నియు సాంప్రదాయ రహస్యములతో సంస్కృతములో నున్నందున సర్వులకు సులభ గ్రాహ్యములు గాకున్నవి
కనుక గృహ నిర్మాతలు విషయములను చక్కగా గ్రహించి గృహనిర్మానమును గావించు కొనిన యడలను ,ప్రాచీన గృహములలో నున్న దోషములను సవరించు కొనిన యెడల సర్వ విధముల సుఖమును ,సుభాదికమును బడయ చుండుటఏ కాక ప్రశాంత జీవనము గడప గలరు

VASTHU FOR BED ROOMS

మీర కనుక వాస్తున్న నమ్మే వారైతే బెడ్ డెకరేషన్ ఎలా చేయాలి. దాంతో సంతోషంగా ఎలా గడుపుతారనే.. ఈ చిట్కాలు పాటించి చూడండి.
 1. వాస్తు శాస్త్రం ప్రకారం, పడక గది చతురస్రాకారం లేదా ధీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. ఇలా ఉండటం వల్ల దాంపత్య జీవితంలో అధికంగా సంతోషం, ప్రశాంతత ఏర్పడుతుంది. 
2. పడకగది తలుపులు 90డిగ్రీ యాంగిల్ లో తెరచి ఉండేలా ఉంచాలి. వాస్తు ప్రకారం పడక గది తలుపులు పూర్తిగా తెరచి ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల మంచి జరిగే బదులు చెడు జరుగుతుంది. కాబట్టి బెడ్ రూమ్ డోర్స్ ఎప్పుడు కానీ పూర్తిగా తెరచి ఉంచకూడదు. 
3. పడకగదిలోని ప్రవేశించగానే ప్రశాంతతను నెలకొల్పే విధంగా ఉండాలి. అందుకు మీకు ఇష్టమైన ఫోటోను లేదా మీ దంపతులిద్దరూ కలిసున్న ఫోటో ఫ్రేమ్ లను, లేదా మంచి పెయింటింగ్ లేదా ఫ్లవర్ వాజ్ లను ఉంచడం వల్ల ఆహ్లాదాన్ని ఇస్తుంది. మూడ్ ను మార్చి సంతోషంగా ఉండేలా చేస్తుంది. 
4. పడకగదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిష్ అక్వేరియం, లేదా మొక్కలు, లేదా దేవుని విగ్రహాలు ఉంచరాదు. 
5. పడకగదికి సున్నితమైన లేత బ్లూ, లేత గ్రీన్, మరియు హాఫ్ వైట్ కలర్స్ బాగా సూట్ అవుతాయి. వీటితో గోడలకు పెయింట్ చేయడం వల్ల మనస్సు ప్రశాంతత ఏర్పడుతుంది. సాఫ్ట్ లైట్ కలర్స్, లైట్ పింక్, బ్లూ,రోజ్, గ్రీన్ మరియు ఎల్లో లేదా వైట్ కలర్ వంటి కలర్స్ కూడా మీ పడక గదికి అందాన్ని మాత్రమే కాదు, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. వాస్తుప్రకారం ఇది చాలా మంచిది. 
6. పడకగదిలో ఉపయోగించి డిమ్ లైట్స్ మీకు నచ్చేవిధంగా ఎంపిక చేసుకోవాలి. అవి ముఖ్యంగా అడ్జెస్ట్ చేసుకొనే విధంగా ఉంటే మీకు కావలసినంత వెలుగును నింపుతాయి. 
7. వాస్తును పాటించే వారు చాలా మంది పడక గదిలో అద్దం ఉండకూడదంటుంటారు. పడకగదిలో అద్దం ఉండటం వల్ల వ్యక్తుల మధ్య మనస్పర్థాలు, గొడవలకు దారితీస్తుందని అంటారు. 
8. ఒక వేళ తప్పనిసరిగా పడకగదిలో అద్దం పెట్టుకోవాలనుకొన్నప్పడు ఖచ్చితంగా వాస్తును పాటించడం మంచిది. మీరు పడుకొనే బెడ్ కు ఎదురుగా కాకుండా ఓ ప్రక్కగా అమర్చుకోవాలి. రాత్రి సమయంలో పడుకొనే ముందు తప్పకుండా ఆ అద్దంను ఓ వస్త్రంతో కప్పి ఉంచాలి. 
9. పడకగదిలో టీవి లేకుండా చూసుకోవాలి. దాంతో టైమ్ కు నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. మంచి నిద్రను పొందుతారు. అయితే వాస్తు ప్రకారం, ఏవైనా ఎలక్ట్రిక్ పరికరాలు పెట్టుకోవాలనుకొన్నప్పుడు, పడకగది ఆగ్నేయంలో ఉంచుకోవచ్చు. 
10. మరొక ముఖ్యమైన వాస్తు చిట్కాల ఏంటంటే పడకగది డెకొరేషన్ లో వుడ్ తో తయారు చేసి బెడ్ ను అమర్చుకొంటే మంచిది. బెడ్ ను నైరుతిలో దక్షిణం మరియు పశ్చిమ దిశలో ఉండేలా చూసుకోవాలి. ఉడ్ తో తయారు చేసినటువంటి మంచాలలోపలి భాగంలో వేరే ఇతర సామాగ్రిని నింపకుండా చూసుకోవాలి. ఒక వేళ బాక్స్ బెడ్స్ ఉన్నట్లైతే ఖచ్చితంగా అవి చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా, క్లీన్ గా ఉండేవిధంగా చూసుకోవాలి.


  • గృహావరణలో పగలు సూర్యకాంతి-రాత్రి వెన్నెల ప్రసరించాలి. ఆవరణలోని ఆగ్నేయ, నైరుతి, వాయవ్య, పశ్చిమ దిశలలో గోతులుగాని, గుంతలు గానీ ఉండకూడదు





  • దాయాదులు, రక్తసంబంధీకుల ఇళ్ళు పారుదప్పిన, తమ గృహాలకు కీడు చేయును. అట్లే వారి ఇంటి కూసాలు, తమ ఇంటిలోనికి చొచ్చుకొచ్చిన లేమి కలుగును. తన ఇంటికి తూర్పున పెద్దవాడు, దక్షిణాన చిన్నవాడు, పశ్చిమాన మధ్యవాడు అన్నదమ్ముల్లో జ్యేష్ఠుడు దక్షిణం వైపు ఉండాలి. 
 
  • వియ్యంకుడి ఇంటి వెన్నుగాడి, తన ఇంటితో కలిసినచో కీడు ఏర్పడును (అనగా పక్క పక్క నుండకూడదు). పొరుగువారి దీపపుకాంతి, తమ ఇంటిలోనికి ప్రసరించేలా ఉండరాదు. ఇతరుల ఇళ్ళ, వాకిళ్ళ, గోడల మూలలు తమ ఇంటి వాకిళ్ళలోనికి చొచ్చుకురాకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు.
ప్రతి గృహానికి గర్భగోడలు పూర్తిగా పైకప్పును తాకే విధంగా ఉండాలి. పిట్టగోడలు పనికిరావు. కొందరు గృహ గర్భగోడలను సగం వరకు కట్టడం లేదా అలంకరణ నిమిత్తం మధ్యలో ఆపివేయుట వాస్తు ప్రకారం నిషిద్ధమo
దిక్కులు - దిక్పాలకులు 
తూర్పు - ఇంద్రుడు 
పడమర - వరుణుడు 
దక్షిణం - యముడు 
ఉత్తరం - కుబేరుడు 
ఈశాన్యం -  ఈశ్వరుడు 
వాయవ్యం - వాయుదేవుడు 
నైరుతి - నిరృతి (రాక్షసుడు) 
ఆగ్నేయం - అగ్నిదేవుడు 
 
ఆయా దిక్కులకు గల సహజ బలం ఎలా ఉంటుందంటే..?
ఉత్తరం : ఐశ్వర్య, భోగ భాగ్య కారకుడు. సకల సంపత్కరుడు. ధనాధిపతి. కుబేరుడు. 
 
ఈశాన్యం: ఈశాన్య దిక్పతి. మృత్యుంజయుడు. సకల శుభకారకుడు. వంశోద్ధీపకుడు - శివుడు. 
 
తూర్పు : క్షత్రియ సంభవుడు. దర్పం కీర్తి కారకుడు. రాజస గుణాధిక్యత కలవాడు. ఇంద్రుడు. 
 
వాయవ్యం : అస్తిరత్వం ఎక్కువ. చంచలబుద్ధి. స్థాన భ్రష్ఠత్వం కలిగించే గుణం కలవాడు వాయుడు. 
 
పశ్చిమం: పాశంతో బంధించి, పురుషులకు తక్కువ సామర్థ్యాన్ని ఇచ్చేవాడు. వరుణుడు. 
 
ఆగ్నేయం : దురహంకారి. సర్వదగ్ధ సమర్థుడు. ధన లేమి కారకుడు రోగ కారకుడు కూడా అగ్నే. 
 
దక్షిణం:  మృత్యు కారకుడు. వినాశకుడు. దరిద్ర కారకుడు. సమపర్తి. ధనహీనుడు యముడు. 
 
నైరుతి: నర వాహనుడు. రాక్షసుడు. పీడాకారకుడు. రక్తపాన మత్తుడు. హింసాకారకుడు నైర్పతి. పై ఎనిమిది దిక్కుల్లో తొలి మూడు దిక్పాలకులు శుభ కారకులు. అదే వరుస క్రమంలో ఒకరినిమించి మరొకరు (4 నుంచి 8) వరకు అశుభ కారకులు అని వాస్తు నిపుణులు అంటున్నారు. 

జీవించేందుకు సౌకర్యవంతమైన ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే సొంతింటి కళ నెరవేర్చుకుంటే మాత్రం సరిపోదు, వాస్తుకు చెందిన మెలకువలు తెలుసుకోవాలి. వాస్తు ప్రకారం ఇల్లుంటే లక్ష్మీదేవి కొలువవుతుందని, సంపద సృష్టికి మార్గమవుతుందని వాస్తు పండితులు అంటున్నారు. 
 
* ఇంటి ఉత్తర ప్రాంతంలో నీలిరంగు వేయాలి. ఇక్కడ వంటగది, టాయ్‌లెట్లు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ ప్రాంతంలో చెత్తడబ్బా, చీపురు, వాషింగ్ మెషీన్‌లను ఉంచవద్దు. వంటగది అంటే అగ్నిదేవుడు కొలువై ఉండే ప్రాంతం. ఏదైనా వస్తువులు తప్పుడు స్థానంలో ఉంచితే, డబ్బు నీళ్లలా ఖర్చవుతుంది. కెరీర్ దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి.
 
* అన్ని ప్రాంతాలలో ఈశాన్య ప్రాంతం ఎంతో ముఖ్యమైనది. ఈశాన్య ప్రాంతంలో నిబంధనలు పాటిస్తే, బ్యాంకుల నుంచి ఋణాలు సులభంగా అందుతాయి. ఇతరుల నుంచి పెట్టుబడులు చేకూరుతుంది. వాస్తుని పాటించిన గృహాలు నిత్యం సకలసంపదలతో కళకళలాడుతూ ఉంటుంది.
 
* ఇంటి ప్రధాన ద్వారం అందంగా ఉంటే సంతోషంతో పాటు శ్రేయస్సు సిద్ధిస్తుంది. ఇంటికి పచ్చని తోరణాలు మంచి రంగులు, గడపకు పసుపు కుంకుమలతో అలంకరిస్తే సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతుంది. కష్టాలు దూరంగా జరుగుతాయి. ఉదాహరణకు వాయవ్యంలో తలుపుంటే రుణాలు, ఆర్థిక సమస్యలు వస్తాయి. ఉత్తరంలో ద్వారముంటే, మంచి కెరీర్, ఆర్థిక స్థిరత్వం సుసాధ్యం. తూర్పున తలుపున్న ఇంట శాంతి సిద్ధిస్తుంది. పశ్చిమాన తలుపుంటే ధనలాభాలు లభిస్తుంది. దక్షిణాన తలుపున్నా మంచిదే.
 
* ఆగ్నేయాన వంటగది ఉండాలి. లేత ఎరుపు, నారింజ, గులాబీ రంగులు సూచించే కలర్స్ వేస్తే మంచిది. బీరువా, పని చేసుకునే టేబుల్, డ్రాయింగ్ రూం తదితరాలు ఉత్తరం వైపున ఉంటే సరిపడినంత ధనం లభించే అవకాశాలుంటాయి.
 
* పడమర వైపున తెలుపు, పసుపు రంగులు శుభసూచకం. ఇక ఇంట్లోని నైరుతీ ప్రాంతం సేవింగ్స్‌ను సూచిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లల చదువులకు వినియోగించవచ్చు.ఈ ప్రాంతంలో బీరువాను ఉంచి డబ్బు, ఇతర విలువైన వస్తువులు ఉంచితే అవి కలకాలం భద్రంగా ఉంటుంది. ఈ నిబంధనలు పాటిస్తే, ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ సమతూకంగా ఉంటూ సుఖశాంతులు, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి.